బహుగా ప్రార్ధన చేయుడి | Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru
Table of Contents
Bahugaa Praardhana Cheayudi Song Lyrics
బహుగా ప్రార్ధన చేయుడి – ఇకమీదట – బహుగా ప్రార్ధనచేయుడి బహుగా ప్రార్ధనచేసి – బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి – దేవుని కెపుడు మహిమ కలుగనీయుడి
|| బహు ||
చెడుగెక్కువగుచున్నది – భూలోకమున చెడుగెక్కువగుచున్నది = చెడుగుపై – మంచిపై చేయిగలదౌనట్లు – విడువక ప్రార్ధించుడి మీప్రార్ధన – కడవరకు బోనీయుడి
|| బహు ||
వాగ్ధానములు చూడుడి – దేవుని గ్రంధ వాగ్ధానములు జూడుడి = వాగ్ధానములె జరుగవలసిన కార్యంబుల్ – వాగ్ధానములునమ్ముడి ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి
|| బహు ||
విందునన్న దేవుని వాగ్ధానము – విందుగా ధ్యానించుడి = విందులో నుండగా – వింతగ నెరవేర్పు – బొందియానందింతురు – ఇది రెండవ విందంచు గ్రహింతురు
|| బహు ||
విసుగుదల జెందరాదు – ప్రార్ధన నెరవేర్పు తత్ క్షణమెరాదు = విసుగున్నచో సిద్ధి – వెనుకకే పోవును – వసియించుడి దేవుని వాగ్ధానమున భటులవలె నిల్వుడి
|| బహు ||
సంశయము పనికిరాదు – లేశంబైన – సంశయము పనికిరాదు = సంశయింపకదైవ – సన్నిధియందుమీ – యంశమువిడజెప్పుడి – దానికి గొప్ప – యంశబట్టనీయుడి
|| బహు ||
సిద్ధికనుపింపకున్న – వాగ్ధానములో – సిద్ధియున్నది చూడుడి = సిద్ధియప్పుడు మీకై – సిద్ధమైవెడలి ప్ర-సిద్ధి లోనికివచ్చును – మీ నమ్మిక వృద్ధిగాంచి – నిల్చును
|| బహు ||
సంతోషమందరారె – మనదేవుని సంస్తుతి చేయరారె – సంతోష బలముచే – సర్వ కష్టములను – అంతరింపజేతుము – మనదేవుని సంతోషపరచెదము
|| బహు ||
అంతయు మనదేగదా – యేసునికున్న – దంతయు మనదేగదా = అంతయుమన ప్రభువు – ఆర్జించియున్నాడు – స్వంతమని అందుకొనుడి మీ ఆత్మకు – శాంతిజెందనీయుడి
|| బహు ||
విజయ జీవనము మనదే – క్రీస్తిచ్చిన – విజయజీవనము మనదె = విజయ జీవనము మనదె – విశ్వమంతయు మనదె – భజనసంఘంబు మనదె దేవుండున్న – పరలోకమెల్ల మనదే
|| బహు ||
Pingback: Naakintha Protsaha Song Lyrics | Srastha | Bible Mission Songs | Old Is Gold - Ambassador Of Christ
Pingback: Jayamu Keerthanalu Song Lyrics || Bible mission Songs || Old Is Gold - Ambassador Of Christ
Pingback: Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu - Ambassador Of Christ