Yahova Na Mora Lalinchenu Song Lyrics | latest Telugu Christian Songs

🎵 Worship Mode

యెహోవ నా మొర లాలించెను | Yahova Na Mora Lalinchenu Song Lyrics | latest Telugu Christian Songs

Yahova Na Mora Lalinchenu Song Lyrics

Yahova Na Mora Lalinchenu Song Lyrics

యెహోవ నా మొర లాలించెను
దన మహా దయను నను గనించెను
అహర్నిశల దీనహీనుడగు నా
దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ||

పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ||

మదావలము బోలు నా మదిన్
దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ||

అనీతి వస్త్ర మెడలించెను
యేసునాథు రక్తమున ముంచెను
వినూత్న యత్నమే ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రేమ నాకు జూపెను ||యెహోవ||

విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ||

అగణ్య పాపియని త్రోయక
నన్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||

Youtube Video

More Songs

ఏ రాగమో తెలియదు | Ye Ragamo Teliyade Song Lyrics || Heart Touching1

📖 Quick Bible Quiz

Score: 0 / 3

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top