Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas song | S.P Balu
Table of Contents
Entha Deenathi Deenamo Song Lyrics
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
నీ సృష్టిలో ఈ లోకమే నీవు
మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా
నీకు స్థలమే దొరకలేదయ్యా (2)
||ఎంత||
నిండు చూలాలు మరియమ్మ తల్లి
నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
దిక్కుతోచక ఓ యేసయ్యా
పశువులపాకలో ప్రసవించెనయ్యా (2)
||ఎంత||
చల్లగాలిలో చాటు లేక
నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)
పసికండువై ఓయేసయ్యా
తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2)
||ఎంత||
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
Youtube Video
More Songs
Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs