అబ్రహాము నమ్మిన దేవుడా | Abrahamu Nammina Devuda Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.RAMESH Anna

Table of Contents
Abrahamu Nammina Devuda Song Lyrics
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా
ఇశ్రాయేలు కాపరి – బహుగొప్ప నేర్పరి
నీకు సాటియెవరు యేసయ్యా
సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా
సత్యవంతుడా మహా పరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా
నీలి మేఘమును నీడగా మార్చి
అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి
సైన్యములకు నీవే సారధిగా నిలిచి
నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన
మా పక్షమైయున్న- మహారాజువు నీవే
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై
నిరాశల నీడను తొలగించెదవు
విస్తారమైన నీకృపలతో నింపి
నిస్సారమైన బ్రతుకును మార్చెదవు
విజయోత్సవముతో ఊరేగించెదవు
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
సాత్వీకముతో – దీర్ఘశాంతముతో
విసుగక నాయెడల వాత్సల్యము చూపి
ఒంటరిగా నను ఎన్నడు విడువక
వేదనలో నను దాటి వెళ్లక
తల్లివలె ఒడిలో లాలించువాడవు
తీరని నీ రుణము వివరింప తరమా
Youtube Video

More Songs
Karuna Kataksham Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.FREDDY PAUL
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
