Bhayapadaradu kreestu viswasi Song Lyrics | Bible Mission Songs | Old Is Gold

భయపడ రాదు – క్రీస్తు విశ్వాసి | Bhayapadaradu kreestu viswasi Song Lyrics | Bible Mission Songs | Old Is Gold | M Devadas Ayyagaru

Bhayapadaradu kreestu viswasi Song Lyrics

భయపడ రాదు – క్రీస్తు విశ్వాసి – భయపడి దిగులు – పడరాదు సుమీ – భయపడుటెందుకు – బైబిలునందున – నయమగు వాగ్ధానంబులు గలవు = భయపడకుడనెడి పలుకులు నీకు – జయము గలుగ మూడు వందల అరువై – అయిదు గలవు – ఏ – డాది పొడుగున – భయపడకు నిరాశ పడకు మెందున
|| భయ ||

చిమ్మ చీకటులు – కమ్మిన రీతిగ – ఇమ్మహి కష్టము లెన్నో గలుగగ – నమ్మించు ద్రోహము నష్టము దుఃఖము – సొమ్మసిల్లునటుల చుట్టు కొనంగ = నమ్మిన వారికి వెలుగుగ నక్ష – త్రమ్ములవలె వేన వేలు వాగ్ధాన – మ్ములుండ ద్రోసి కీడు నిను – దూరమ్ము చేయ దొమ్మిగ రాగలదా
|| భయ ||

నీవే స్వయముగ – నీ కష్టములలో – దేవా యని ప్రార్ధించుచు నుండగ దేవుని వగ్ధా – నావళి నానుకొని దీవెన కొరకై – దిట్టముగ వేడుగ – దైవ గ్రంధమందునున్న వాక్యము – లే వరాల మూటయంచు దానిలో జీవ మొంద నీవు చేయు ప్రార్ధన – నే విధాన దాటి కీడు రాగలదా
|| భయ ||

పాటలు ప్రార్ధన – వాక్య పఠనము – ధాటియౌ శుభవార్త ప్రకటనలు దీటగు కానుకల్ – తెచ్చు సమర్పణ – నీటుగ జేసిన – నిలబడ గలవు = లోటు లేక యీ యాచారములను – మేటియనగ నీవు చేయుచుండగ వీటినెల్ల – నడ్డగించి నిజముగా – దాటి మీదికి కీడు రాగలదా
|| భయ ||

Youtube Video

Bhayapadaradu kreestu viswasi Song Lyrics

More Songs

Mudu Siluvalu Mosithiva Song Lyrics | Bible Mission | telugu Kraistava Keerthanalu | DevaDas ayyagaru

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top