తనువు నా దిదిగో – Thanuvu Naa Didigo Song Lyrics | Old Telugu christian Songs | Andhra Kraisthava Keerthanalu
Table of Contents
Thanuvu Naa Didigo Song Lyrics Telugu
తనువునాదిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి ప్రతిష్టంపు మీ = దినములు – క్షణములు – దీసికొని యవి నీదు వినుతిన్ ప్రవహింపజే – యను శక్తినీయుమీ
|| తనువు ||
ఘనమైన నీ ప్రేమ – కారణంబుననీకై – పనిచేయ జేతులివిగో = అనయంబు నీ విషయమై సొగసుగా చురుకుదనముతో బరుగెత్త వినయ పాదము లివిగో
|| తనువు ||
స్వరమిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడ నిమ్ము = మరియు పెదవులివిగో – మహానీయమైన నీ పరిశుద్దవార్తతో పరిపూర్ణముగ నింపు
|| తనువు ||
వెండిపసిడి యివిగో – వీసమైనను నాకై – యుండవలెనని కోరను నిండైన నీయిష్ట = నియమంబు చొప్పున – మెండుగ వాడబరిమితియౌ జ్ఞానంబి దిగో
|| తనువు ||
నాయిష్టమిదిగో – యిది నీయిష్టముగ జేయ – నాయిష్టమిక – కాదది = నాయిచ్చయున్నట్టి – నా హృదయ మిదిగో నీ – కే దియియె రాజకీయ సిం హాసనమౌ
|| తనువు ||
ఉన్న నా ప్రేమ నీ సన్నిధానముననే – నెన్నడు ధారబోయన్ = నన్ను – నీ వానిగ నాధా గైకొనుమపుడు – చెన్నుగ నీ వశమై స్థిరముగ నుండెద
|| తనువు ||