ఏకాంత స్థలము కోరుము | yekantha sthalamu korumu Song Lyrics | biblemission songs

Table of Contents
Yekantha Sthalamu Korumu Song Lyrics
ఏకాంతస్థలము కోరుము – దేవుని ప్రార్ధింప –
ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి –
మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము
|| ఏకాంత ||
ఊహలోని పాపములను – ఒప్పుకొనుము తండ్రియెదుట = దేహము లోపలకవియె – దిగుచు నిన్ను బాధ పెట్టును
|| ఏకాంత ||
మాటలందలి పాపములను – మన్నించుమని వేడుకొనుము = ఆట పాటలందుమాట – లాడుటయు నేరంబులగును
|| ఏకాంత ||
చేయబోయి మానుచెడ్డ – చేతలన్ని ఒప్పుకొనుము = ఈయత్న పాపంబులెల్ల – ఎన్నిక లోనికి వచ్చును గాన
|| ఏకాంత ||
పాప క్రియలు అని దుఃఖముముతో -ప్రభుని యెదుట ఒప్పుకొనుము = పాపము మరల చేయనట్టి – ప్రయత్నంబుల్ చేయవలెను
|| ఏకాంత ||
ఎవరిని అల్లరి పెట్టినావో – వారియొద్ద ఒప్పుకొనుము = ఎవరియొద్ద చెప్పినావో – వారియొద్ద ఒప్పు కొనుము
|| ఏకాంత ||
తప్పు వినుట సర్ధాయైన – తప్పే తప్పు ఒప్పు కొనుము = తప్పు తట్టు ఆకర్షించు – తగని ఆట పాట లేల
|| ఏకాంత ||
కలలో చేసిన తప్పులెల్ల – కర్త యెదుట ఒప్పుకొనుము – తలపులో లేనిది యెట్లు – కలలోనికి వచ్చియుండును
|| ఏకాంత ||
నిన్ను మరల సిలువవేసి – యున్న పాప జీవినయ్యో = నన్ను క్షమియించుమని – యన్న నరులు మారువారు
|| ఏకాంత ||
చెడుగుమాని మంచిపనులు – చేయకున్న పాపమగును = పడియు లేవకున్న గొప్ప – పాపమగును పాపమగును
|| ఏకాంత ||
దుష్టులు వర్ధిల్లుట చూచి – కష్టము పెట్టుకొనరాదు = కష్టము పెట్టుకొన్న నీవు – దుష్టుడవుగా మారినట్టే
|| ఏకాంత ||
భక్తిపరుల శ్రమలు చూచి – భక్తిహీనులని యనవద్దు = భక్తుల శ్రమలకు ముందు – బహుమానంబు దొరుక గలదు
|| ఏకాంత ||
బీదల కాహారము బెట్ట – వెనుకదీసి పొమ్మనరాదు = నీ ధనము నీకేకాదు అది నినుగని దేహియను వారికిని
|| ఏకాంత ||
రొగులను దర్శింపబోవ – రోతయని భావింపవద్దు = బాగుపడు పర్యంతమువరకు – పరిచర్యచేయుట మెప్పు
|| ఏకాంత ||
ఎట్టియబద్దాలు పలుకు – నట్టివారికి నరకమచు = చిట్టచివరి పుస్తకంబు – చెప్పునది యోచన చేయుము
|| ఏకాంత ||
జీవరాసులను బాదుట – జీవహింస నేరమౌను = దేవుడు నిన్నడుగజెప్పు తెగువగలుగ గలదా నీకు
|| ఏకాంత ||
ఒకరి వంకమీదపెట్టి – ఒకరిననుట పిరికితనము = ముఖము యె దుట అడిగి స్నేహ – మును గలిగించు కొనుట మెరుగు
|| ఏకాంత ||
గుడిలో కూర్చుని కార్యక్రమము – గుర్తింపకుండుట యశ్రద్ద = చెడగొట్టి వేయు చుండు – పెడచూపు మనోనిదానము
|| ఏకాంత ||
వాక్యాహారము తిననియెడల – బలమాత్మకు లభించుటెట్లు = వాక్య గ్రంధములోని దేవుని – పలుకువినక నడచుటెట్లు
|| ఏకాంత ||
దినప్రార్ధనలు చేయని యెడల – దేవునిశ్వాస పొందుటెట్లు = మనసులోని స్వీయశ్వాస – మలినము పోవుటెట్లు
|| ఏకాంత ||
పరులకు బోధించు సేవ – జరుపలేక యున్నయెడల = పరమభక్తి పరులకైన – బహుమానంబు దొరుకుటయెట్లు
|| ఏకాంత ||
ప్రభువుకొరకు పనిచేసిన – వారికి తాను బాకీ పడడు = సభ నిమిత్తము చేసినది తన – స్వంతము కన్నట్టె యెంచు
|| ఏకాంత ||
చందా నీది కాదు క్రీస్తు – సంఘాభివృద్ధికె చెందు = చందావే యుము ప్రభువు నీకే – చందవేయును నీకు అరోధి
|| ఏకాంత ||
యేసు నామమందు మనము – యేదిచేసిన సఫలమగును = యేసుక్రీస్తు పేరును చేయు – నేదైన దేవునికి మహిమ
|| ఏకాంత ||
దేవా!నాకు కనబడుమన్న – దేవదర్శనమగును నీకు = పావనం బగు రూపముచూచి – బహుగా సంతోషించగలవు
|| ఏకాంత ||
దేవా!మాటలాడుమన్న – దేవవాక్కు వినబడు నీకు – నీవు అడిగి న ప్రశ్నలకెల్ల – నిజము తెలియనగును నీకు
|| ఏకాంత ||
తప్పు వివరము చెప్పకుండ – తప్పుమన్నించుమనియన్న = తప్పు తప్పుగానేయుండు – తప్పుదారివృద్ధిపొందు
|| ఏకాంత ||
ఏడు తరగతులున్నవి నీది – ఏదో తెలిసికొనుము యిపుడే = కీడు మాని మంచి చేసిన – క్రిందితరగతి దొరుకునేమో
|| ఏకాంత ||
నరుల మీద ప్రేమ క్రీస్తు – వరునిమీద ప్రేమయున్న = పరలో కమున వరుడు ఉన్న – పైతరగతిలోనే చేరుదువు
|| ఏకాంత ||
ఆలోచింపకుండ ప్రశ్న – అడుగవద్దు నరుడుకాడు = నీలోని జ్ఞానము వలన – నిరుకు తెలిసిన నడుగనేల
|| ఏకాంత ||
మోటుమాట – లాడవద్దు – మోటుపనులు చేయవద్దు = చాటున చేసిన పాపములు – సమయమపుడు బైలుపడును
|| ఏకాంత ||
ఉత్తర మాలస్యముగావచ్చిన – ఉత్తరమసలే రాకయున్న – ఉత్తమ విశ్వాసమును ప్రార్ధన – ఉత్తవియైపోవును విచారము
|| ఏకాంత ||
వ్యర్ధమైన ఊహాలు మాటలు – పనులు నిన్ను వ్యర్ధపర్చును = తీర్ధమువలెనె పాపముత్రాగిన – తీర్పు శిక్ష సహింపజాలవు
|| ఏకాంత ||
ఏపాపమునకైన పరుల – కే శిక్షయును రాకుండెను = నా పాప ములకు శిక్షకలుగు-నా? యన్న అజ్ఞానమగును|| ఏకాంత ||
Youtube Video
Yekantha Sthalamu Korumu Song Lyrics
More Songs
Yekantha Sthalamu Korumu Song Lyrics

Pingback: Yesu naama smarana Song Lyrics | Bible mission songs | Latest Telugu christian song| Bible Mission - Ambassador Of Christ