ఇదిగో దేవా! నా జీవితం | Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu
Table of Contents
Idhigo Deva NaaJivitham Song Lyrics
ఇదిగో దేవా నా జీవితం – ఆపాద మస్తకం నీకంకితం
శరణం నీ చరణం – శరణం నీ చరణం (2)
పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు – నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా – ఈ నా శేష జీవితం
|| ఇదిగో దేవా ||
నీ పాదముల చెంత చేరి – నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి – ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నన్నుండనిమ్ము
|| ఇదిగో దేవా ||
విస్తార పంట పొలము నుండి – కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు – కలకాలం మరినాకు నొసగు
క్షేమక్షామ కాలమైనా – నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ – నీదరి చేర్చు కృపనిమ్మయా
|| ఇదిగో దేవా ||
Youtube Video
More Songs
Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs
Pingback: Kummari O Kummari Song Lyrics | Latest Telugu Christian Songs 2020 | Prabhu Pammi - Ambassador Of Christ