రాజువైన యేసయ్య మమ్ము యేలేటి మా రాజా | Jalari Panduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Samuel Karmoji Ministries
Table of Contents
Jalari Panduga Song Lyrics
పల్లవి:
రాజువైన యేసయ్య – మమ్ము యేలేటి మా రాజా (2x)
మా చీకటి బ్రతుకుల్లో – వెలుగు నింపావు
మేము కోరేటి రేవునకు – చక్కంగ నడిపావు
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
1వ చరణం:
చేపలు పట్టే జాలరివి – చదువే రాని పామరుని
మనిషిని పట్టే జాలరిగ – చక్కంగ మలిచావు (2x)
నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు
మహిమల రాజ్యము దారి చూపే మనసును నిమ్మలపరచావు (2x)
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
2వ చరణం:
చేప లేక చింత పడితిని – రాతిరంతా వలవేసితిని
లోతుగా వలలు వేయమని – చల్లంగ పలికావు (2x)
నా వలలు పగిలిపోయేటి – గొప్ప వేటనిచ్చావు
బ్రతికేటి దారి నాకు చూపి – చింతనంత తీసావు (2x)
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
3వ చరణం:
అద్దరికి పోవ చూచితిని – దోనెను నేను ఎక్కితిని
త్రోవలో తుఫాను తాకిడికి – తల్లడిల్లి పోతిని (2x)
బూతమని భయపడితిని – నేనే భయపడకంటివి
దేవకుమార నీవే అని నిండుగా నిన్నే మ్రొక్కితిని (2x)
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
ఓ ఓ ఓ – ఓ ఓ ఓ
ఓ ఓ ఓ – ఓ ఓ ఓ
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.