స్తుతి కీర్తనీయుడా | Sthuti keerthaneeyuda Song Lyrics | Hosanna Ministries 2026 New Song Pas.ABRAHAM & Pas.RAMESH

Table of Contents
Sthuti keerthaneeyuda Song Lyrics
స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ
నా హృదయ వీణపై శృతిచేసి పాడనా
నా యేసురాజా అనురాగ బంధమా
నన్ను విడవలేని
ఆత్మ అనుబంధమా(2)
నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా
నీ ప్రేమ కౌగిలిలో
నన్ను ఆదరించుమా(2)
నీ సిలువ త్యాగం నేనెలా మరిచిపోదును
ఇలలోన నీకై సాక్షిగా జీవింతును (2)
(నా యేసు రాజా)
నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా
నీ వెలుగు జాడలలో నిను వెంబడించిగా(2)
నీ జీవ వాక్యం నింపినే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం
సర్వదా నీకే అంకితం(2)
(నా యేసు రాజా)
మహిమ సింహాసనం నే చేరాలనే
నే కన్న కలలన్నీ నిజమైన వేళలో(2)
నా జయము నీవై నిలిచినా శ్రేష్ట తరుణాన
నీలోనే లీనమై పోదునే నే నిరంతరము(2)
(నా యేసు రాజా)
Youtube Video

More Songs
Divya Thejomaya Song Lyrics | Nyaayaadipathi | Hosanna Ministries 2026 New Year Song

Pingback: Sakhudaa Divya Sakhudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 - Ambassador Of Christ