సఖుడా – దివ్య సఖుడా | Sakhudaa Divya Sakhudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026

Table of Contents
Sakhudaa Divya Sakhudaa Song Lyrics
సఖుడా – దివ్య సఖుడా
ప్రియుడా – ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈ నాటిది
ఏనాటికీ వీడిపోదు – విభుడా యేసయ్యా
ఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక – పలికే గీతిక
మౌనరాగమే – మధురగానమై
మరుపురానిదై – మదిలో నిలిచెగా
ఊహించని శోధనలే – శృతిలయలు నేర్పినాయి
పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో – ఏ కాంతి లేకున్ననూ
నా పాదములు జ్ఞారక – కాపాడే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
నిండు మనస్సులో – ప్రేమ దీపమై
మారుమనస్సుకై – సత్యమార్గమై
పలికే ప్రేమనీవై – నీవు నాతో నున్నావు
నా హృదయసీమ నేలే – మహరాజుగా నిలిచావు
నీవు నా ముందుగా – నడిచే కాపరిగా
నా చేయి వీడకా – నడిపించే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
రమ్యమైనది – భాగ్యమైనది
నిత్యమైనది – సరిపోల్చలేనిది
నీ మహిమ రాజ్యమందు – సీయోను శిఖరమందు
నే పరవశించి పాడే – గొప్ప భాగ్యమిచ్చినావు
నూతనమైనది – ఎవరూ పాడలేని
శ్రేష్ఠమైన గీతం – నే పాడెద యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
Youtube Video

More Songs
Sthuti keerthaneeyuda Song Lyrics | Hosanna Ministries 2026 New Song Pas.ABRAHAM & Pas.RAMESH
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Pingback: Sowndaryapurnudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.JOHN WESLEY - Ambassador Of Christ