నా హృదయమా | Naa Hrudayamaa Song Lyrics | Pastor Ramesh anna | Hosanna Good Friday New Song 2026
Table of Contents
Naa Hrudayamaa Song Lyrics
పల్లవి:
నా హృదయమా – నా ప్రాణమా ..
నా శ్వాసతో – అనుబంధమా ..
నా కొరకే నరరూపివై – నా పాప భారము మోసి
నా కొరకు బలియైనది నీవే – నా యేసయ్యా….
చరణం 1:
చిందిన నీ రక్తం – పారెను సెలయేరై
చీల్చ బడిన దేహం – ఓర్చెను ఆ భారం
శిక్షకుపాత్రుడనైన – నను రక్షించుటకా
చిత్రవధ చేసిన – మౌనిగ నిలిచినది
ఎవరు – నాపై – చూపని ప్రేమే కదా
ప్రేమామయా – తేజోమయా…
నీ ప్రేమ ఎంతో బలము
నీ త్యాగమెంతో ఘనము
నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను – నా యేసయ్యా
చరణం 2:
చేదు చిరకనిచ్చి – నిను అవమానించిరిగా
స్వార్థ పరుల అహమే – గెలిచిన ఆవేళ
తులువలనే క్షమించెను – నీ దైవత్వము
తుదిశ్వాసవరకు ప్రేమించెను నీ దాతృత్వము
నీకే నీకే అది సాధ్యమైనది
ప్రేమామయా – తేజోమయా
నీ ప్రేమ ఎంతో బలము
నీ త్యాగమెంతో ఘనము
నే వివరించలేనయ్యా నా యేసయ్యా…
Youtube Video
More Songs
Idigo Naa Jeevitham Song Lyrics | Latest Hosanna ministries Songs 2026