మురిసిపోకే ఓ అందమా | Murisipoke O Andama Song Lyrics | Beauty Is Temporary | Telugu Christian Message Song 2026
Table of Contents
Murisipoke O Andama Song Lyrics
Intro:
ఎంత మురిసినా అందమా….
నిన్ను మట్టిలో పెడతారే అందమా….
Chorus:
మురిసిపోకే ఓ అందమా – నీవు మురవబోకమ్మా అందమా
ఎంత మురిసినా అందమా – నిన్ను మట్టిలో పెడతారే అందమా
ముసిముసి నవ్వులు అందమా – నీవు నవ్వమాకమ్మా అందమా
నిన్ను నమ్ముకొని అందమా – నట్టేట మునిగారే అందమా
అందమా నీవు మురిసిపోకే అందమా – నీవు మురువాబోకే అందమా
నీవు ఎగసిపడకే అందమా… |2|
1
ఉదయకాలమున అందమా – ఎంతో పచ్చంగ ఉంటావే అందమా
మధ్యాహ్నమందున అందమా – నీవు మాడిపోతావమ్మా అందమా
అద్దము ముందర అందమా – ఎంతో అందంగ ఉంటావే అందమా
అరగంటలోనే అందమా – నీవు ఆవిరైపోతావే అందమా
పాండ్సు రుద్దిన అందమా – పాసి వాసనోస్తాదమ్మా అందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||
2
ఏసీలో ఉంటే అందమా – ఎంతో సక్కంగ ఉంటావే అందమా
నీడకు ఉంటే అందమా – నిగనిగ లాడుతావందమా
బ్యూటీపార్లర్లోన అందమా – ఎంత బ్యూటీగా ఉంటావే అందమా
మ్యాచింగేసుకొని అందమా – నీవు మనసు దోచుకుంటావందమా
మరచిపోకే ఓ అందమా – నీది మూడునాళ్ళముచ్చటందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||
3
వయసు మీద పడితే అందమా – నీకు ముడతలొస్తయమ్మా అందమా
స్కిన్ లైటు పెట్టిన అందమా – నీ స్కిన్ను పాడైతదే అందమా
షుగరు వస్తే ఓ అందమా – నిన్ను సూడబుద్దే కాదు అందమా
చెమటవస్తే ఓ అందమా – నిన్ను చీదరించుకుంటారే అందమా
స్లిమ్ముగున్నానని అందమా – నీవు చిందులేయకమ్మా అందమా (2)
మరచిపోకే ఓ అందమా – నీది మూడునాళ్ళముచ్చటందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||
4
తెల్లగున్నానని అందమా – తెగ మురిసిపోతున్నావే అందమా
గ్లామరున్నాదని అందమా – నీవు గంతులేస్తున్నావు అందమా
రూపాయిలతోనే అందమా – నీ రూపాన్ని దిద్దకే అందమా
నగలేసుకోగానే అందమా – నీ నడక మారిందమ్మ అందమా
వద్దు వద్దు ఓ అందమా – ఇది వట్టి చెత్తమ్మ అందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||
Youtube Video
More Songs
Baaludu kaadhammo balavanthudu yesu | Sandhadi2 (Joyful Noise) Christmas Folk song
Join our whatsapp channel to participate in telugu biblle quiz and win spiritual gifts