కష్టాలన్నీ వస్తే రానీ | Kashtalanni Vaste Raani Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2026
Table of Contents
Kashtalanni Vaste Raani Song Lyrics
కష్టాలన్నీ… వస్తే రానీ
కన్నీళ్లన్నీ… జారిపోనీ
నమ్మకమే నీలో నీతో
కడవరకు నిలిచిపోనీ
ప్రతి అడుగు నీ విజయం కోసం
సైన్యంలా సాగిపోనీ…
కష్టాలన్నీ… వస్తే రానీ
కన్నీళ్లన్నీ… జారిపోనీ
వీచే గాలి తోస్తున్నా… కురిసే వర్షం తడిపేస్తున్నా
ఉరుము పిడుగు ఒకటై వచ్చి భయపెట్టేస్తున్నా
ఎదగడమే మరి తెలిసిన చెట్టు నేలకు వాలేనా…
ఫలించడమే తన పనిగా చేస్తూ…
తన పువ్వుల అందం… తన ఫలముల మధురం
ఏనాటికైనా… ఏ చెట్టుకైనా తెలియనిదా…
ఓటమీ అయినా… వస్తే రానీ
పాఠాలన్నీ… నేర్పిపోనీ…
వలచిన మగువ కాదంటే… వద్దంటూ వెలిపోతుంటే
మిగిలిన జీవితమంతా నీకు చేదైపోయిందా…
కని పెంచి నిను సాకిన కడుపున శోకం మిగలాలా…
తన కొడుకే గోడకు బొమ్మైపోవాలా…
నీ జీవన గమనం… ఆ సుందర భవితం
ఎవరెవరో కోసం… కలగానే అంతం కావాలా…
కాదంటేనే… చనిపోవాలా…
చనిపోయాక… ఏమైనా మేలా…
ఒంటరిగా… పుడుతూ చస్తూ…
సాగే ఈ… పయనంలోన…
ఎవరున్నా… లేకున్నా గానీ…
నీ గమ్యం… చేరి తీరాలీ…
జీవితమంటే… దేవుని వరమే…
ఆ దేవునితోనే… నడవాలి మనమే…
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.