మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతము | Manasara Paadana Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Manasara Paadana Yesayya Song Lyrics
మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతము
ముదమార చాటనా నా తండ్రి మధుర వాక్యము
తరగనిది చరగనిది విడువనిది ఎడబాయనిది
ప్రేమ నా యేసు ప్రేమ – ప్రేమ ప్రేమ తండ్రి ప్రేమ
మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతము
ముదమార చాటనా నా తండ్రి మధుర వాక్యము
కరములు చాపి పిలిచిన ప్రేమ
కౌగిట దాచి కాచిన ప్రేమ
కన్నీరు తుడిచి ఓదార్చిన ప్రేమ
కలతలు బాపి కృప చూపిన ప్రేమ
కరుణా కటాక్షములను కురిపించిన ప్రేమ
ప్రేమ ప్రేమ కల్వరి ప్రేమ
మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతము
ముదమార చాటనా నా తండ్రి మధుర వాక్యము
నా స్థితి చూచి జాలిని చూపి
నా గతి మార్చి నన్ను స్థిర పరిచి
నా కృప నీకు చాలు నన్న ప్రేమ
నా జీవితాన నమ్మతగిన ప్రేమ
నా ప్రాణ ప్రియుడైన యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ శాశ్వత ప్రేమ
మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతము
ముదమార చాటనా నా తండ్రి మధుర వాక్యము
సిలువను మోస్తూ సహించిన ప్రేమ
నిలువున నలిగి కరిగిన ప్రేమ
రక్తము కార్చి నను క్షమించిన ప్రేమ
నా రక్షణకై బలియైన ప్రేమ
మృత్యుంజయుడై నన్ను బ్రతికించిన ప్రేమ
ప్రేమ ప్రేమ కనికర ప్రేమ
మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతము
ముదమార చాటనా నా తండ్రి మధుర వాక్యము
Youtube Video
More Songs
Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.