కరుణ గల యేసయ్యా || Karuna Gala Yesayya Song Lyrics || New Telugu Christian Song 2023 || Uplifting Song || Hermon Ministries Song
Table of Contents
Karuna Gala Yesayya Song Lyrics
కరుణ గల యేసయ్యా –
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే – నాకు ఊపిరే లేదయ్యా (2)
1) నా సొంత ఆలోచనలే – కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే – నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త –
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా – విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా – విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా –
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
3) నా జీవితమంతా – జీవించెద నీ కొరకే
నాకు ఉన్న సమస్తము – అర్పించెద నీ సేవలో (2)
పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా –
నీ సహాయముండుట – నాకు క్షేమమయ్యా (2)
నీ సహాయముండుట – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
Song Credits
Hermon Ministries VGR
Pingback: PHALIYINCHUTA NERPAYYA SONG LYRICS | Latest Telugu Christian Songs 2024 | Moses Dany | Pastor Daniel Raj P - Ambassador Of Christ