Andhamaina Podharillu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries

Table of Contents
Andhamaina Podharillu Song Lyrics
పల్లవి :
అందమైన పొదరిల్లు నీది
అందులోన అనురాగం ఉన్నది (2)
అంతులేని త్యాగమే నీది
అవధులు లేని అనుబంధమే మనది (2)
యేసయ్య నీ ప్రేమ ఎంత మధురము
యేసయ్య నీ కృపయే అమృతము (2)
(అందమైన )
ఆనంద నిలయము నీ సన్నిధానము
అభాగ్యులందరికీ ఆశ్రయ పురము (2)
అవసరాలు తీర్చే దాతృత్వము నీది
ఆశ్రయించు వారికి సౌభాగ్య నిలయము (2)
(యేస్సయ్య )
ఆదర్శమైన ప్రేమ నిలయము
అన్యోన్యత నిండిన అమరలాయము (2)
ఆప్తులు ఎవరు చూపని అనురాగము
నీది అనుక్షణము నాపై కృప చూపునది
(యేస్సయ్య )
అమోఘమైనవి నీ కార్యములు
అవనిలో నాకవి కలకీర్తులు (2)
అమూల్యమైనవి నీ ఉపదేశములు
ఆత్మాభివృద్దికి అవి ఆభరణములు
(యేస్సయ్య )
అందమైన పొదరిల్లు నీది
అందులోన అనురాగం ఉన్నది (2)
అంతులేని త్యాగమే నీది
అవధులు లేని అనుబంధమే మనది (2)
యేసయ్య నీ ప్రేమ ఎంత మధురము
యేసయ్య నీ కృపయే అమృతము (2)
Youtube Video

More Songs
