బెత్లెహేములో నజరేతు ఊరిలో | Bethlahemulo Najarethu Urilo Song Lyrics | Latest Christmas Song 2024

Table of Contents
Bethlahemulo Najarethu Urilo Song Lyrics
బెత్లెహేములో నజరేతు ఊరిలో (2)
వాక్యమే శరీరధారియై వచ్చిన..
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి (2)
|| బెత్లెహేములో ||
యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను
యూదా రాజుగా భూవిలో ఉదయించెను (2)
యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. (2)
నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను (2)
పశువుల శాలలో పవళించెను (2)
|| బెత్లెహేములో ||
గొల్లలు జ్ఞానులు యేసుని చూచి
బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి
పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి (2)
చూచిన యేసుని ఇలలో ప్రకటించెను (2)
రక్షకుడు నేడు ఉదయించినాడని (2)
బెత్లెహేములో నజరేతు ఊరిలో (2)
వాక్యమే శరీరధారియై వచ్చిన..
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి (2)
Youtube Video

More Songs
