Kanivini Erugani Karyam Song Lyrics | Latest Telugu Christmas song 2024

కనివిని ఎరుగని కార్యం చూసిందిరా ఈ లోకం | Kanivini Erugani Karyam Song Lyrics | Latest Telugu Christmas song 2024

Kanivini Erugani Karyam Song Lyrics

Kanivini Erugani Karyam Song Lyrics

ప:-
కనివిని ఎరుగని కార్యం చూసిందిరా ఈ లోకం –
పరమందున్న ఆ దైవం భువికేతెంచిన వైనం “2”
ప్రజలందరికీ మోక్షం పరమతండ్రి నిర్ణయం-
యేసుక్రీస్తు త్యాగం క్రిస్మస్ లో వున్న సత్యం

అ.ప:-
చేద్దాం పండుగ క్రిస్మస్ పండుగ
మారిన హృదయంతో – చేద్దాం పండుగ
క్రిస్మస్ పండుగ రక్షణ అనుభవముతో

ఆదిలో ఆదాము హవ్వలు
చేసిన అవిధేయత కార్యము –
మానవ జాతికి సంక్రమింపచేసేను జన్మతః పాపము “2”
ఆ పాపానికి పరిహారము ఒక పరిశుద్ధుని రక్తము –
దైవతనయుని ఆగమనము నెరవేర్చెను ఆ ప్రవచనము “2”
|| చేద్దాం పండుగ ||

బెత్లేహేములో పశువుల పాకలో
పరుండిన ఆ దైవము –
పాపికి విడుదల కలిగించుటకు ధీనుని స్వభావము “2”
వెనుదీయలేదు ఏ మాత్రము విడిచివచ్చుటకు పరలోకము –
నీవు గ్రహించిన ఈ మర్మము ఆహా ఎంతో ఎంతో భాగ్యము “2”

చేద్దాం పండుగ క్రిస్మస్ పండుగ
మారిన హృదయంతో – చేద్దాం పండుగ
క్రిస్మస్ పండుగ రక్షణ అనుభవముతో

Youtube Video

More Songs

Vachindhi Christmas Vachindhi Song Lyrics | Folk Song | by Joshua Gariki | Latest Telugu Christmas Songs 2018

1 thought on “Kanivini Erugani Karyam Song Lyrics | Latest Telugu Christmas song 2024”

  1. Pingback: Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top