Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Hosanna Ministries New Song 2024 | Ramesh anna

నాలో ఏమి చూచి నీవు | Hosanna Latest New Song 2024| Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Ramesh anna

Naalo Yemi Chuchi Neevu Song Lyrics

Naalo Yemi Chuchi Neevu Song Lyrics

నాలో ఏమి చూచి నీవు –
ఇంత ప్రేమ చూపినావు (2)
మర్త్యమైన లోకమందు –
నిత్యమైన కృపను చూపి (2)
నేటివరకు తోడుండినావు
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా(2)
నాలో ఏమి చూచి నీవు –
ఇంత ప్రేమ చూపినావు (2)

నా తల్లి గర్భమునే – నను కోరితివి
విశ్వాస గృహములో – నను చేర్చితివి (2)
అమృత జలమైన – నీ నోటి మాటలతో
నిఖిల జగతికి – నను పంపినావు
ప్రకటింప నీ చరితం – నా జన్మ నిజ ఫలితం (2)
|| నాలో ఏమి చూచి నీవు ||

ఘనులైన వారే – నీ యెదుటనున్నను
బలమైన వారే – ఎందరో ఉన్నను (2)
కన్నీళ్ళ కడలిలో – శ్రమల సుడులలో
నా స్థితి చూసి – నను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా – కడవరకు నీ సాక్షిగా (2)
|| నాలో ఏమి చూచి నీవు ||

ప్రేమానురాగము – నీ సంస్కృతియే
కరుణ కటాక్షము – నీ గుణ సంపదయే(2)
నలిగిన రెల్లును – విరువని వాడా
చితికిన బ్రతుకును – విడువని వాడా
నా పైన నీకెందుకో – ఈ తగని వాత్సల్యము (2)
|| నాలో ఏమి చూచి నీవు ||

దవళ వర్ణుడవు – రత్న వర్ణుడవు
వర్ణనకందని – అతి సుందరుడవు (2)
ఇరువది నలుగురు – పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో – సింహాసనముపై
ఆసీనుడా యేసయ్యా – నా స్తుతి నీకేనయ్యా (2)
|| నాలో ఏమి చూచి నీవు ||

Youtube Video

More Songs

Sraavyasadhanamu Song Lyrics ॥ శ్రావ్యసదనము ॥ Hosanna Ministries 2024 New Album Song-5

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top