నరుడు ఏ పాటివాడని సృష్టిని చేసావు | Narudu Epati Vaadani Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Gani Cantor

Table of Contents
Narudu Epati Vaadani Song Lyrics
నరుడు ఏ పాటివాడని సృష్టిని చేసావు
మానవుడు ఎంత ఘనుడని ఈ ప్రకృతిని ఇచ్చావు (2)
వానికోసమే ప్రభువా సమస్తము చేసావు
నీ చేతి పనుల మీద అధికారమిచ్చియున్నావు (2)
|| నరుడు ||
చరణం 1:
ఉదయములో మంచు కురిసే వేళలో
కారు మబ్బులలో కాంతి వచ్చే సమయములో
చలికాలంలో చల్లగా వీచే గాలిలో
సువాసనలో మల్లెలు పూసే తరుణములో (2)
పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు
అది నీవే చేసావని మహిమ పరచక ఉన్నారు (2)
|| నరుడు ||
చరణం 2:
సాయంత్రములో గలగల పారే సెలయేరులో
పక్షులకిలకిలలో కోయిల కూసే గానములో
ఆ కొండలలో ఎదురుగా ఉన్న లోయలలో
వృక్షాలలో ఆ పూల తోటలో (2)
పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు
అది నీవే చేసావని తెలియకనే జీవిస్తారు (2)
|| నరుడు ||
Youtube Video

More Songs
Triyekuda | Najareyidaina Na Yesu Deva Song Lyrics | Gani Cantor | Latest Telugu Christian Song 2025
