నిన్న – నేడు – రేపు | Ninna Nedu Repu Song Lyrics | Latest Telugu Christian Song2024 | Vijay Prasad Reddy Songs
Table of Contents
Ninna Nedu Repu Song Lyrics
నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుకా
భోగాలు కావాలంటు పాదం భూమిని చుట్టేసాక
ఆగాలి ఎదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక
నాదంటే నాదనుకుంటు ఏంతో కోంత పోగేసాక
నావెంట వచ్చేదేంటని చూస్తే శున్యం అంతా వెనుక
మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కదా
ఎండకు వాడాలని అవి సూచించటం లేదా
తేనుందని మురిసే లోగా తుమ్మెద రాదా
మాయగా మకరందం పువ్వును విడచిపోదా //2//
బంధం అనుబంధం లోకంతో సంబంధం
గాలికి రాలేటి పువ్వులదా ఈ చందం
మాయగా మనిషి నేల రాలి వెళ్లి పోతుంటే
|| నిన్నేగా ||
పువ్వుల సువాసనే మనిషికి పాఠం కాదా
నీతిని వెదజల్లాలని నేర్పించుట లేదా
పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా
ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా … ఓ ఒ //2//
మాయను నమ్మొద్దు మాయచేసి బ్రతుకొద్దు
నీ ప్రశ్నకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు
లోతు భార్యవలె వెనుక తిరిగి చూడొద్దు
నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుకా
భోగాలు కావాలంటు పాదం భూమిని చుట్టేసాక
ఆగాలి ఎదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక
నాదంటే నాదనుకుంటు ఏంతో కోంత పోగేసాక
నావెంట వచ్చేదేంటని చూస్తే శున్యం అంతా వెనుక
Youtube Video

More Songs
కన్నీటితో నిండిన గుండెతో | Kannititho Nindina Gundetho Song Lyrics ||
