Oo Manishi Nee Prayasametu Song Lyrics | Spirits Protection | Latest Telugu Christian songs 2024

ఓ మనిషీ నీ ప్రయాసమెటు | Oo Manishi Nee Prayasametu Song Lyrics | Spirits Protection | Latest Telugu Christian songs 2024

Oo Manishi Nee Prayasametu Song Lyrics

Oo Manishi Nee Prayasametu Song Lyrics

ఓ మనిషీ నీ ప్రయాసమెటు.. ఓ మనిషి నీ ప్రయాసమెటు…
ఈ లోకా సిరి సంపదకొరకా… పరలోక ప్రభు ప్రయాసానికా
నిర్ణయించుకొని.. నిజము తెలుసుకో మనిషి…

లక్షాధికారివైన లవణమన్నమేకాని
మెరిసే బంగారాన్ని తినలేరు ఎవరు..
పట్టుపానుపు పైన పవళించినగాని
ఆరడుగుల సమాధిని చేరనివాడెవడు
కన్నులార చూచుటయేగాని “2”
ధనమువలన తృప్తినొందలేరు ఏ నరులు
మరణంతో ఏమి తీసుకోరు ఈ మానవులు
|| ఓ మనిషి ||

వ్యర్ధం వ్యర్ధం అని ప్రసంగి తెలుపుచున్నాడు
సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంత
జ్ఞానముతో, తెలివితో సంపాదించిన సంపద
అనుభవించకుండానే విడిచి వెళ్ళుతారు
మంచులాగ కరిగే ఈ జీవితం.. “2”
ఆశల వలయంలో చిక్కుకొనుట వ్యర్ధం…
లోకాశలు కలిగి జీవించుట వ్యర్ధం..
|| ఓ మనిషి ||

వ్యర్ధం కానిది ప్రయాసము ప్రభుదని
అర్ధముతో క్రియలుచేయ ప్రయాసపడుమూ…
ప్రభునందు ప్రయాసము అలయక చేయుచు…
స్థిరులునూ, కదలనివారిగమీరుండాలి
ప్రభునందు మృతినొందినవారే ధన్యులని “2”
మరణంతో సత్ క్రియలే వెంట వచ్చునని
పరిశుద్ధతతో పనులే దేవుని చేర్చునని…
|| ఓ మనిషి ||

Youtube Video

More Son

Nakevvarunnaru neevu thappa Song | Latest Telugu Christian Song 2024 | Pastor. Samuel Paul Rowthu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top