కష్టాలెన్నున్నా | Kastalennunna Song Lyrics | Latest Telugu Christian Songs 2022 | Daniel Surya Avula | Rahul Roy | Desmond John | Moses Dany
Table of Contents
Kastalennunna Song Lyrics
పల్లవి:
కష్టాలెన్నున్నా – కన్నీళ్ళెన్నైనా
కాలమెంతైనా – కారణమేదైనా (2)
విడువను నిన్ను- కదలను నేను (2)
నీకోసమేగా నన్ను ఎన్నుకొన్నావు
నీకోసమేగా నన్ను చేసుకొన్నావు (2)
చరణం-1 :
పరిశుద్ధుతండ్రివైన నిన్ను పోలి నేను – పరిశుద్ధునిగా నీతో నడవాలని
జగత్పునాది వేయకముందే – నీ ఉన్నత ప్రేమలో నన్నుచూసావు
ఆదిలో నువ్వే అంతము చెప్పి- నీ మహిమను నాకు చూపించావు
నీసంకల్పం నాకు జీవమై – నీకోసమే నన్ను బ్రతకమన్నావు (2)
కష్టాలెన్నున్నా – కన్నీళ్ళెన్నైనా
కాలమెంతైనా – కారణమేదైనా (2)
చరణం-2:
క్రీస్తుకూడ నాకొరకు శ్రమలననుభవించి- మౌనియై నాకు మాదిరయ్యాడు
శ్రమలే మహిమకు మార్గమంటూ – ధైర్యమిచ్చి నన్ను ఆదరించాడు
మార్గమే చూపి నీనీతి నాకిచ్చి – నిత్యమూ నీతోవుండే కృపను చూపావు
నీ దర్శనమే నాకు గమ్యమై – నీసన్నిధికే నన్ను నడవమన్నావు (2)
కష్టాలెన్నున్నా – కన్నీళ్ళెన్నైనా
కాలమెంతైనా – కారణమేదైనా (2)
విడువను నిన్ను- కదలను నేను (2)
నీకోసమేగా నన్ను ఎన్నుకొన్నావు
నీకోసమేగా నన్ను చేసుకొన్నావు (2)
Youtube Video
More Songs
కన్నీటితో నిండిన గుండెతో | Kannititho Nindina Gundetho Song Lyrics ||
Pingback: Uthamudu Manchi vadu na Devudu Song Lyrics | Robert stoll | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ