స్తుతులివిగో… నా ప్రభువా… | Sthuthulivigo Naa Prabhuva Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Raj Prakash Paul | Jessy Paul | Worship Conference 2024

Table of Contents
Sthuthulivigo Naa Prabhuva Song Lyrics
ఏది ఏమైనా గాని… నిన్ను స్తుతియింతును
కష్టమేమైనా గాని.. నిన్ను స్తుతియింతును… ప్రభు
ఏది ఏమైనా గాని నిన్ను స్తుతియింతును
కష్టమేమైనా గాని నిన్ను స్తుతియింతును…
నీతో నుండుటే జీవితం
నీతో నుండుటే ధన్యము
స్తుతులివిగో… నా ప్రభువా…
ప్రియమైన నా దేవా
మేలులకై స్తోత్రములు
దీవెనకై కృతజ్ఞతలు
శుద్దుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్
పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్
ఎంతో ఘనమైనది నీ స్నేహం
వివరించలేని నీ త్యాగం
ఎంతో ఘనమైనది నీ స్నేహం
వివరించలేనిది నీ త్యాగం
నన్ను ప్రేమించి ప్రియ నేస్తమా
|| స్తుతులివిగో… ||
పోరాటముల పరిస్థితులలో నీవైపే చూచెదను
శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొనెదన్ (2)
ఓ దేవా నా దేవా నీవే నా క్షేమాధారం నీవే
ఓ ప్రేమ నా ప్రేమ నీవే జీవన మార్గము నీవే (2)
ఏది ఏమైనా గాని… నిన్ను స్తుతియింతును
కష్టమేమైనా గాని.. నిన్ను విడువను… ప్రభు
నీతో నుండుటే జీవితం
నీతో నుండుటే ధన్యము
|| స్తుతులివిగో… ||
ప్రతి స్థితి గతులను మార్చువాడా నీవే ఆశ్రయ దుర్గము
దిక్కులేని వారలను ఆదుకోను వాడ మేలు చేయు దేవుడవు (2)
ఓ రాజా నా రాజా నీవే నా రక్షణ కేడెము నీవే
ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయ దుర్గము నీవే (2)
బానిసైయున్న నన్ను బిడ్డగా చేసితివే
యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే
బానిసైయున్న నన్ను బిడ్డగా చేసితివే
యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే
ఎలా నీ ఋణం తీర్చేదన్
నా సర్వం నీకే అంకితం ప్రభువా…..
|| స్తుతులివిగో… ||
Youtube Video

More Songs

This song is very wonderful.
Everyday I singing this song…..
Thanks to Raja Prakash Paul Anna ❤️❤️❤️❤️
praise the LORD
Thank u so much for being spiritual parents to me and like many those who really need god’s love thank u anna god bless u and akka
Pingback: Ghaadandakaaramulo Ne Song Lyrics | Neeve Nireekshana | Living Hope Telugu Version | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ
Pingback: Nee Raktham Challandi Song Lyrics | Raj prakash Paul | Jessy Paul | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ