నా కన్నుల్లో ఆనందమే హరించెనే | Naa Kannulo Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Swapna Edwards
Table of Contents
Naa Kannulo Song Lyrics
నా కన్నుల్లో ఆనందమే హరించెనే
జీవితంలో బంగారు ప్రేమనే కోల్పోయేనే
ఆదరణే లేక నా హృదయము పగిలిపోయెనే
యేసు నా చేయి వీడక నీతో నన్ను కొనిపోవుము
నాలో ఈ వేదన ఈ కన్నీటి జీవితం
భారమై నను కాల్చేనే
ఈ కష్టాల ఊబిలో నాకు నీవే తోడుగా
ఉండవా ఓ యేసయ్య
Verse 1
ప్రకాశించే నక్షత్రాలు ఆకాశంలో ఎంత సుందరమో
అటువలె నా రోజులన్నియు కొంతకాలమే ప్రకాశించెన్
దేవా రావా నేను మునిగిపోవుచున్నాను
నన్ను నీవే ధైర్యపరచి ఉంచవా
ఈ లోక సంద్రములో నే ఉండను
నా దాగు చోటు నీవై ఉండు
యేసయ్య నన్ను కాపాడవా
నా హృదయమును చక్కదిద్దవా
Verse 2
దేవా నీవెంతయినా నమ్మదగిన వాడవు ప్రభు
జీవితం ఎంత దుఃఖమైనా చివరికి నీ కిరీటమిస్తావు
నన్ను నీదు శక్తితో నింపి జీవింపచేయుము
నీకే తెలియును నా వేదనంతయు
ఈ లోక సంద్రములో నే ఉండను
నా దాగు చోటు నీవై ఉండు
యేసయ్య నన్ను కాపాడవా
నా హృదయమును చక్కదిద్దవా
Youtube Video
More Songs
Papa Song Lyrics | Bridge Music ft. Prince Mulla, Zayvan & Sam Alex Pasula | Latest Christian Songs