శక్తిచేత కానే కాదు | Shakthi Chetha Kane Kadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Shakthi Chetha Kane Kadu Song Lyrics
శక్తిచేత కానే కాదు, బలముతో యిది కాదు కాదు
దేవుని ఆత్మ ద్వారానే …
౹౹దేవుని రాజ్యం కట్టబడుతుంది౹౹
నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు గనుక భయపడకుడి, భయపడకుడి
ధైర్యాన్ని వహియించి బలమంతా ధరియించి, పని యింక జరిగించుడి
౹౹దేవుని రాజ్యం కట్టబడుతుంది౹౹
భూమిమీద ఎక్కడైనా, ఏ జనము మధ్యనైనా
చేయబడని అద్భుతాలు చేస్తాను నీ మధ్యన
శత్రు జనముకు అవమానం కలిగేటట్లు
వారి చెవులు చెవుడెక్కిపోయేటట్లు
నీవు చూచి ప్రకాశించునట్లుగా!
కృప కలుగును గాక ! కృప కలుగును గాక !
కృప కలుగును గాక ! ఆమేన్ !
ఓ గొప్ప పర్వతమా! జెరుబ్బాబేలును
అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు
చదును భూమిగా అవుతావు యిపుడే నువ్వు
జెరుబ్బాబేలును ఏర్పరచుకున్నా నేను
కృప కలుగు గాక అంటుండగా!
భూమి ఆకాశమును నేల సముద్రమును
కంపింపజేస్తా నేను నా మందిరముకై
వెండి నాది బంగారం కూడా నాది
సర్వ జనముల ఐశ్వర్యమంతా నాది
నేను మీకు తోడై యుండగా!
ఇత్తడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను
ఇనుమునకు ప్రతిగా వెండిని యిస్తాను నేను
మహిమతోటి నింపేస్తా మందిరమును
సమధానము నివసింపజేస్తా నేను
మహిమ నుండి అధిక మహిమతో!
నేనే నా సంఘమును బండమీద కట్టుదును
పాతాళ ద్వారములు దానియెదుట నిలువలేవు
పరిశుద్ధాత్ముడు కార్యాల్ని చేస్తుండంగా
యేసు నామం హెచ్చింపబడుతుండంగా
శిష్యులంతా సాక్ష్యం యిచ్చుచుండగా!
You shall be called
The Repairer of the breach,
Restorer of paths to dwell in.
పాడైన పునాదులను మరల కట్టువాడవాని
విరుగబడిన దానిని బాగు చేయువాడవని
జనులు దేశంలో నివసించునట్లుగాను
త్రోవలు సిద్ధం చేసేటి వ్యక్తివంటూ
నీకు క్రొత్త పేరు పెట్టేంతగా!
Pingback: Daiva Maata Maa Nota Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ