Krupa Kaligina Vaada Song Lyrics | Vagdevi | Jesus Telugu New Song 2025 | Faith Church
Table of Contents
Krupa Kaligina Vaada Song Lyrics
కృప కలిగిన వాడ నీలో నిలిచెదను
దయగల యేసయ్యా నీతో నడిచెదను(2)
నా జీవిత కాలము పాటలు పాడెదను
నా బ్రతుకు దినమంతా ఆరాధించెదా(2)
|| కృప కలిగినవాడ ||
నా బ్రతుకు బాటను నీవేసావే
ఆ మంచి మార్గములో నను నిలిపావు(2)
ఆరిన నేలకు సెలయేరువు నీవు
నా దారికి రహదారివై నా ముందున్నావు(2)
పాటలు పాడేదను నా జీవిత కాలము
ఆరాధించేద నా బ్రతుకు దినములు(2)
|| కృప కలిగినవాడ ||
చేయాలేనన్న సేవకు పిలుపిచ్చావే
ఆ .. పరిచర్యకు వెలుగిచ్చావు (2)
సన్నిధిలో సహవాసం లో నన్ను ఉంచావు
సంఘంలో సేవకునిగా నన్ను మార్చవు
నీ సన్నిధిలో సహవాసం లో నన్ను ఉంచావు
నీ సంఘంలో సేవకునిగా నన్ను మార్చవు
పాటలు పాడేదను నా జీవిత కాలము
ఆరాధించేద నా బ్రతుకు దినములు(2)
|| కృప కలిగినవాడ ||
పోయేనన్న ప్రాణాన్ని తిరిగిచ్చావే
బ్రకనన్న ఆశను బ్రతికించావు(2)
నీవు ఇచ్చిన ఈ ఊపిరి నీకే అంకితం
నీవు ఇచ్చిన ఈ దేహం నీకే సొంతమయా(2)
పాటలు పాడేదను నా జీవిత కాలము
ఆరాధించేద నా బ్రతుకు దినములు(2)
|| కృప కలిగినవాడ ||
Youtube Video
More Songs
Anthyakaala Abhishekame Song Lyrics | Vagdevi | New Year Song 2025