నా యెడల నీవు చేసిన మేలులను | Neevu Chesina Melulanu Song Lyrics | New Year Song 2025 | The New Life Church
Table of Contents
Neevu Chesina Melulanu Song Lyrics
నా యెడల నీవు చేసిన మేలులను
వర్ణింపలేను వివరింపలేను (2)
మరువలేనయ్య నీ మధుర ప్రేమను(2)
విడువలేనయ్య నీ సన్నిదానమును
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
ఆరాధన స్తుతి ఆరాధన(2)
|| నా యెడల నీవు ||
శ్రమల సంకెళ్లు నన్ను పట్టి బంధించినా
సాయపడు వారు లేక కృంగియున్న సమయాన (2)
నీ గొప్ప వాస్థల్యం నాపైన చూపించి
కీడు నుండి తప్పించి మేలులతో నింపితివి(2)
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
ఆరాధన స్తుతి ఆరాధన(2)
మరణ పాశాలు నన్ను చుట్టి భాదించిన
వేదనకు తాళలేక సోలియున్న సమయాన (2)
నీ శక్తి సామర్థ్యం నా లోకి పంపించి
సేవలోన తరిగించే భాగ్యము ఇచ్చితివి (2)
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
ఆరాధన స్తుతి ఆరాధన(2)
నా యెడల నీవు చేసిన మేలులను
వర్ణింపలేను వివరింపలేను (2)
మరువలేనయ్య నీ మధుర ప్రేమను(2)
విడువలేనయ్య నీ సన్నిదానమును
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
ఆరాధన స్తుతి ఆరాధన(2)
Youtube Video
More Songs
Asamanudu Song Lyrics Telugu | Latest Telugu Christian Song 2024| Bro.Chinny Savarapu