యేసు చరితం – ఆదర్శము | Yesu Charitham Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Nireekshana Melodies
Table of Contents
Yesu Charitham Song Lyrics
పల్లవి:
యేసు చరితం – ఆదర్శము
యేసు సన్నిధి – సౌభాగ్యము
యేసు నామం – మధురాతి మధురం
యేసు స్మరణం – అమితానందం
అనుపల్లవి:
సుందర సురుచిర – యేసుని నామం
సకల ప్రభావ – సలక్షణ నామం
సాధు శుభాషణ – సజ్జన నామం
యేసుని నామం – శుభకర నామం
అనూహ్యమైనది యేసు ప్రభావం
సృష్టికి మూలం ఆయన తేజం
అనంతమైనది యేసుని నామం
అజేయమైనది ముక్తి ప్రసాదం
యేసు మార్గమే జీవన మార్గం
యేసుని బోధలే నిత్యము సత్యము
యేసుని జీవం పరమ పవిత్రం
యేసుని స్మరణం అభయ ప్రధానం
అఖిలము నిఖిలము ఏకైక నామము
అత్యున్నతము యేసుని నామము
సకల జీవులకు ప్రాణాధారం
నమ్మిన వారికి ఆశ్రయస్థానం
అగణిత గణగణ శ్రిత జన పోషణ
మృధు శౌర్యాగుణా భరణా
కామిత దాయక కలుష విమోచక
భక్త పరిపాలకా
జన గణ పోషణ సుమధుర భాషణ సత్యసంభావనా!
పాప వినాశన శాప నివారణ
మృత్యు భయ వారణా
పావన జీవన పతిత జనావన
భక్త పరాధీన
భక్త భావ పుర వీధి విహార
పరమాద్భుత ధీరా
సహృది స్వాంతన మృధు శుభ చరణా
సర్వజనోద్ధరణా
అంజలి గొనుమిదే అభయ ప్రధాన
సుజన నీ రాజనా
సుజన నీ రాజనా
సుజన నీ రాజనా
సుజన నీ రాజనా
స్వరాం… జలి
స్వరాం.. జలి
యేసయ్యా నీకిదె స్వరాం.. జలి
Youtube Video
More Songs
Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics | Good friday Songs 90s