ఏదీ నీ సాక్ష్యము ఏదీ నీ త్యాగము | Yedi Nee Sakshyam Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Yedi Nee Sakshyam Song Lyrics
యేది నీ సాక్ష్యము
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ
అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు
అన్నిటిని భరియించిరి
ఆత్మలు రక్షించిరి
||యేది||
అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి
ఆరని నరకాగ్నికి
దూరంబుగా నుండిరి
||యేది||
ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి
సింహాలకెరయైనను
చింతేమి లేకుండిరి
||యేది||
ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము
చెఱసాల సంకెళ్ళును
నీకేమి లేదిప్పుడు
||యేది||
కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు
కొంతైన చేయంగను
కోరిక గలిగుండాలి
||యేది||
Youtube Video
More Songs
Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.