ఆ నింగిలో తార వెలసే | Aa Ningilo Thaara Velise Song Lyrics | Calvary Temple Latest Christmas Song 2025 | Saahus Prince

Table of Contents
Aa Ningilo Thaara Velise Song Lyrics
పల్లవి:-
ఆ నింగిలోన వింత తార వెలిసే
ఈ నేల చీకటంతా పారిపోయే (2)
బెత్లెహేము పురములోన – బాలుడేసు జన్మించినాడే
దూతలంతా కొత్త పాట పాడే – పరలోకమంతా పరవశిoచిపోయే
పరిశుద్ధుడు పుట్టాడని – పాపిని కరుణించాడని
ప్రభు యేసే రారాజని – పరమును వీడి వచ్చాడని (2)
దేవాది దేవుడే దీనుడై – కన్యమరియకే పుట్టెనే
దావీదుపట్టణమందు నేడు – రక్షకుని మీరు చూతురని
దూత వార్త చాటి చెప్పేనే – ఆ గొల్లలే గానమాడి గంతులేసెనే
పశుల పాకలో ప్రభువునే – భక్తితో పరవశించి పూజించెనే
పరిశుద్ధుడు పుట్టాడని – పాపిని కరుణించాడని
ప్రభు యేసే రారాజని – పరమును వీడి వచ్చాడని
(ఆ నింగిలోన)
పరలోక సైన్య సమూహమే – స్తోత్ర గానం చేసిరే
ప్రజలందరికీ సమాధానమే- కలుగును గాకని పాడిరే
తూర్పు దిక్కు చుక్క చూసిరే- ఆ జ్ఞానులే బెత్లెహేము తరలివచ్చిరే
బాల యేసు పాత చెంతనే- బంగారం సాంబ్రాణి బోళ మిచ్చిరే..
పరిశుద్ధుడు పుట్టాడని- పాపిని కరుణించాడని
ప్రభు యేసే రారాజని – పరమును వీడి వచ్చాడని
(ఆ నింగిలోన)
Youtube Video

More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Pingback: Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025 - Ambassador Of Christ