సృజన కారకుడా నిజమైన దేవుడా | Srujanakaaruda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026
Table of Contents
Srujanakaaruda Song Lyrics
సృజన కారకుడా నిజమైన దేవుడా
సర్వోన్నత స్థలములలో నివసించే యేసయ్య (2)
నీ సత్య స్వభావమును నాలో రూపించి
కృప వెంబడి కృపను నాపై చూపితివి..(2)
(సృజన)
దివి నుండి దిగివచ్చిన దివ్య సుందరుడా
దీనులకు నీవే ఆశాజ్యోతివి (2)
నీ ప్రజల క్షేమముకై మా మధ్యన నిలిచితివి
సంతోష సంబరాలు దయచేసితివి (2)
(సృజన)
సమీపించరాని తేజస్సుగలవాడా
అమరత్వము కలిగిన మహనీయుడవు (2)
విశ్వాధినేతవు నీవే యేసయ్యా
అతి త్వరలో రానున్న రారాజువు (2)
(సృజన)
మమతను కురిపించే మధురా నగరిలో
నా మనోహర ముఖమును దర్శించెదను (2)
నా శ్రమ, దుఃఖమును నేను మరిచిపోయి
నీ పరిశుద్ధులతో చేరి హర్షించెదను (2)
(సృజన)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Join in our whatsapp channel to participate in telugu bible quiz And win Spiritual Gifts and Prizes