Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold

Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold | Reshma Reigna | Hope Amplified Music.

Kadhey Song Lyrics

పల్లవి:
కథే మొదలాయెనె ఇలా
కలం….. రచించలేదుగా
మదే….ఊహించలేదిలా
నీ ప్రేమ నన్ను వెదకి-సర్వాన్ని మార్చేగా

నీ మాటను వినక నేనున్నా
నీ చేతికి దూరంగా పోతున్నా
నీ ప్రేమయే వెంటాడెనే…

నా కాపరై, నా వెంటా వచ్చావే
నా ఊపిరై, ప్రాణంగా మారావే
ఈ ప్రేమకై ఏమిచ్చెదా……?

నా కోసమే ఆ సిలువలో- బలి అయితివే నా యేసువే
ఏ అర్హతయే నాలో ఏమి లేకున్నా
నీ సాటి రాని ప్రేమే నన్ను తాకెనా

నా కన్నులే చూసెనులే – ఆ సిలువపై నీ ప్రేమనే
నాకున్న లోకం మొత్తం నీవే ఐనావే
నీకు వేరుగా నేను జీవించలేనే

చరణం 1:
కథే రచించినావులే……
నా దినములన్నీ ముందే తలంచినావులే…

నీ సొత్తుగా నను మార్చుకున్నావే
ఎల్లప్పుడూ నను కాచివున్నావే
నీ బిడ్డనై జీవించెదా….

నా కాపరై, నా వెంటా వచ్చావే
నా ఊపిరై, ప్రాణంగా మారావే
నీ ప్రేమకై ఏమిచ్చెదా?

“నా కోసమే ఆ సిలువలో
బలి అయితివే నా యేసువే

ఏ అర్హతయే నాలో ఏమి లేకున్నా
నీ సాటి రాని ప్రేమే నన్ను తాకెనా

నా కన్నులే చూసెనులే- ఆ సిలువపై నీ ప్రేమనే
నాకున్న లోకం మొత్తం నీవే ఐనావే
నీకు వేరుగా నేను జీవించలేనే” “2”

“నా లోకం మొత్తం నీవైనావే” “3”
నాకు నీవే….

Youtube Video

Gamyam Christian Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Revanth Reynold | Reshma Reigna

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top