నాదేశం సౌభాగ్యముతో | Naa Desam Sowbhagyamutho Song Lyrics | Pastor Ramesh | Hosanna New Song 2026
Table of Contents
Naa Desam Sowbhagyamutho Song Lyrics
పల్లవి:
నాదేశం సౌభాగ్యముతో – విరజిల్లగా నను చూడని
నేను పుట్టిన నాదేశం – నీవు ప్రేమించిన ఈ దేశం
వర్ధిల్లు గాక – వర్ధిల్లు గాక
వర్ధిల్లు గాక – యేసయ్యా
చరణం 1:
ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యా
నిర్మలమైన ప్రేమను మాకు నేర్పినావయ్యా
అన్నదమ్ములై – ఒక తల్లి బిడ్డలై
జగతికి జ్యోతులై – ప్రకాశించుచు
వర్ధిల్లాలి నాదేశం – జగద్రక్షక యేసయ్యా
చరణం 2:
నా దేశ రక్షణకై బలియైనది నీవయ్య
నా విమోచనక్రయుదనము చెల్లించినావయ్య
నీ సత్య సంపద – నే ననుభవించుచు
నా దేశగౌరవం – శిఖరాలనెక్కుచు
వర్ధిల్లాలి నాదేశం – జగద్రక్షక యేసయ్యా
చరణం 3:
సుస్థిరమైన పునాది నీవే – మహిమ రాజ్యానికి
అద్భుతమైన రక్షణ నీవే – నా దేశానికి
నీ దయాసంకల్పమే – ఆనంద క్షేత్రమై
నీ కృపా సత్యమే – సంక్షేమ సూత్రమై
వర్ధిల్లాలి నాదేశం – జగద్రక్షక యేసయ్యా
Youtube Video
More Songs
Idigo Naa Jeevitham Song Lyrics | Latest Hosanna ministries Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.