సంధ్యవేళ చిన్ని నావ | Sandhya Vela Chinninaava Song Lyrics | Latest Hosanna Ministires Songs 2026
Table of Contents
Sandhya Vela Chinninaava Song Lyrics
పల్లవి:
సంధ్యవేళ చిన్నినావా ఒంటరాయెను
చేరదీసే తోడులేక సొమ్మసిల్లెను -2
నిను చూడ మనసాయే – విధి నాతోరాదాయె
నను చేర దిగిరావా – నను నీతో కొనిపోవా -2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
చరణం 1:
హోరుగాలి పోరు నన్ను – కృంగదీసేనే
చెప్పలేని మూగవేదన – గుండె నిండెనే
నన్నెరిగినవాడవని – నా తోడై వస్తావని
నన్నెన్నడు విడువవవని – నీవైపే చూస్తున్నా
చరణం 2:
అమ్మకన్న కమ్మనైన – ప్రేమయే నీవు
నాన్నకన్న మిన్నయైన – ధైర్యమే నీవు
నా ఆశయం నీవు – నా ఆశ్రయం నీవు
నా శిల్పివి నీవు – నా శిఖరమే నీవు
Youtube Video
More Songs
Idigo Naa Jeevitham Song Lyrics | Latest Hosanna ministries Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.