Adhvithiyuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025

అద్వితీయుడా కాచుకొంటివి | Adhvithiyuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Adhvithiyuda Song Lyrics

Adhvithiyuda Song Lyrics

పల్లవి:
అద్వితీయుడా కాచుకొంటివి –
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా

అను.ప:
నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు |2|
నీ ప్రేమను ఎవరు చూపలేరు
|| అద్వితీయుడా ||

చరణం:
మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు |2|
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి |2|
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు |2|

చరణం:
నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు |2|
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి |2|
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ |2|

చరణం:
ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు |2|
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి |2|
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు |2|

Youtube Video

More Song

Ghanudavu Neve Parishuddudavu Song | Pastor Sagar | Latest Telugu Christian Songs 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top