అమర లోకనాథుడా అంతమే లేనివాడ | Amaraloka Naadhuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries

Table of Contents
Amaraloka Naadhuda Song Lyrics
పల్లవి :
అమర లోకనాథుడా అంతమే లేనివాడ
సర్వలోకనాథుడా ఆది మద్యాంత రహితుడా (2)
సకల జనులకు ఆరాధ్యుడవు
సృజన శీలుడ శుభకరుడా (2)
నీవే నా సర్వము నీవే
నా జీవము నీవే నా ఆరాధన యేసయ్య(2)
(అమర )
శూన్యములో భూమిని వ్రేలాడదీసితివి
అగాధ జలములను రాసిగా పోసితివి 2
నిన్నశ్రయించిన నీ జనులకు అద్భుతాలే చేసితివి
అసాధ్యమైన వాటిని సాధ్యము చేసితివి
(నీవే )
సర్వలోకమును సృష్టించిన వాడవు
మానవజాతికి నిర్మాణ కర్తవు (2)
మనుషులపై ప్రేమతో సిలువ త్యాగమే
చేసితివి విశ్వసించిన వారికి రక్షణ నిచ్చితివి (2)
(నీవే )
ప్రళయ జలములపై ఆసీనుడా యేసయ్య
నిత్యము రారాజుగా మా మధ్య నిలచితివి (2)
నిను వెంబడించిన నీవారికి మోక్షమార్గమే చూపితివి
సుఖ సౌఖ్యాలతోఆశీర్వదించితివి (2)
(నీవే )
అమర లోకనాథుడా అంతమే లేనివాడ
సర్వలోకనాథుడా ఆది మద్యాంత రహితుడా (2)
సకల జనులకు ఆరాధ్యుడవు
సృజన శీలుడ శుభకరుడా (2)
Youtube Videos

More Songs
