చీకటి తొలగించి వెలుగుతో నను నింపి | Cheekati Tholaginchi Song Lyrics | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024

Table of Contents
Cheekati Tholaginchi Song Lyrics
చీకటి తొలగించి వెలుగుతో నను నింపి
ప్రకాశింపజేశావు నీతిసూర్యుడా (2)
లెమ్ము తేజరిల్లుమని నీతోడై ఉంటానని
ఉత్తేజపరచిన ఆత్మనాథుడా (2)
|| చీకటి తొలగించి ||
రక్షణయే నా ప్రాకారముగా చేసితివి
ప్రఖ్యాతియే నా గుమ్మములో నిలిపితివి (2)
నిత్యమైన వెలుగువు నీవయ్యా
భూషణ కిరీటము నీవే యేసయ్యా (2)
|| చీకటి తొలగించి ||
నీ కనుదృష్టిని ఆలంబనగా నిలిపితివి
అలసిన నా హృదిలో ఆసీనుడవు అయ్యావు (2)
అమృతమూర్తివి నీవే యేసయ్యా
అనురాగ వర్షము కురిపించితివి (2)
|| చీకటి తొలగించి ||
బహుతరములకు సంతోష కారణము చేసితివి
శాశ్వతమైన శోభాతిశయముగా మార్చితివి (2)
నా రాజమార్గము నీవే యేసయ్యా
శోభిత వస్త్రము నీవేనయ్యా (2)
చీకటి తొలగించి వెలుగుతో నను నింపి
ప్రకాశింపజేశావు నీతిసూర్యుడా (2)
లెమ్ము తేజరిల్లుమని నీతోడై ఉంటానని
ఉత్తేజపరచిన ఆత్మనాథుడా (2)
Youtube Video

More Songs
