బలవంతుని చేతిలో బాణములం | Balavanthuni Chethilo Song Lyrics | Latest Telugu christian song 2023

Table of Contents
Balavanthuni Chethilo Song Lyrics
బలవంతుని చేతిలో బాణములం
గురివైపే చూస్తూ పరుగెడతాం
మా గమ్యం చేరే వరకు ఆగదీపరుగు
మేము యేసుని వారసులం – రాజు యేసుని సైనికులం
మా గమ్యం చేరే వరకు ఆగదీపరుగు
అటు ఇటు తొలగక యేసుపై గురినిలుపుదాం
ఇచ్చిన ఆజ్ఞలు మరువక పాటించెదం
వాక్యమందు స్థిరపడుచు- ప్రార్ధనందు బలపడుచు
దేవుడిచ్చే సర్వాంగకవచం మేము కలిగుంటాం
పిలిచిన పిలుపుకు లోబడి మేము నడిచెదం
అలయక జడియక క్రీస్తునే ప్రకటించెదం
నిందలైన శ్రమలెదురైన – లోకాశలు వెంటాడుచున్న
వాడబారని మహిమ కిరీటం పొందుటే ధ్యేయం
దేవుని రాజ్యము నీతిని మేము వెతికెదం
శోధన బాధలో బెదరక పయనించెదం
వెనుకనున్నవి అన్నియు మరచి ముందు ఉన్న బహుమానముకై
పందెమందు ఓపికతోనే మేము పరుగెడతాం
బలవంతుని చేతిలో బాణములం
గురివైపే చూస్తూ పరుగెడతాం
మా గమ్యం చేరే వరకు ఆగదీపరుగు
మేము యేసుని వారసులం – రాజు యేసుని సైనికులం
మా గమ్యం చేరే వరకు ఆగదీపరుగు
Youtube Video

Song Credits
Lyrics & Tune:Bro. Gunaveer paul
Vocals : Joselyn ,Jason,Jessica
Music : Prashant RPv
More songs
వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching || david parla
