Bandhakamulalo Padiyundiyu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Song 2024

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Song 2024

Bandhakamulalo Padiyundiyu Song Lyrics

Bandhakamulalo Padiyundiyu Song Lyrics

బంధకములలో పడియుండియూ నిరీక్షణ గలవారలారా!
దినదినమును వధకు సిద్ధమైన గొర్రెవలె ఉన్నవారలారా!
మీ తలలు మరలా పైకి ఎత్తుడి
మీ ధూళిని దులిపి లేచి నిలువుడి
మీ కోటలో మరలా ప్రవేశించుడి
Double Portion – Hey! Double Portion
యేసయ్యలోన యిది నీ స్వాస్థ్యము
Double Portion – Hey! Double Portion
అవమానమంతా మరిచేంత ఆనందము / ఆశీర్వాదము

క్రిందికి వంగి సాగిలపడుము దాటిపోవాలి మేము అని అనగా,
నీ వీపును నేలకు వంచి దాటువారికి దారిని చేసినావుగా!
సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరియించు
నీకు వెలుగు వచ్చెను – నీకు వెలుగు వచ్చెను
నిన్ను బాధించినవారి చేతనే నా క్రోధ పాత్ర
మొత్తము త్రాగిస్తా నేను – మొత్తము త్రాగిస్తా
నువు తగ్గింపబడుట చూడకుందునా!
నీ అవమానం చూచి ఊరకుందునా!
నిను పైపైకి నేను హెచ్చించనా

విడువబడి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినదానా!
తృణీకారమై దుఖ:పడి ఏ ఆదరణ లేకయున్నదానా!
విడనాడబడితివని నిను గూర్చి చెప్పబడదు
క్రొత్త పేరు పెడుతున్నాను – క్రొత్త పేరు పెడుతున్నాను
పాడైన దేశం అంటూ నీ భూమి పిలువబడదు
యిష్టురాలవు నువ్వు – యిష్టురాలవు
నిను నీలాంజనములతో కట్టనా!
నీ కట్టడాన్ని మణులతో నిర్మించనా!
సూర్యకాంతములతో అలంకరించనా!

సంసారి పిల్లల కంటే విడువబడినదాని పిల్లలధికమగును
‘ఈ స్థలము యిరుకు మాకు’ అని చెప్పునంత విస్తారమగును
జయకీర్తనెత్తి నువ్వు ఆనందగానం చెయ్యి
జయగీతం ఎత్తాలి నువ్వు – జయగీతం ఎత్తాలి నువ్వు
నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు
అవమానం తలంచకు నువ్వు – అవమానం
నీ పిల్లలకు నేనే ఉపదేశింతును.
అధిక విశ్రాంతి వారికి కలుగజేతును.
నిన్ను నీతి గలదానిగా స్థాపింతును.

ప్రభువు నన్ను మరచియున్నాడు అని సీయోను అనుకొననేల?
ఒంటరినై విడువబడితిని అని మనస్సులో బాధపడనేల?
తల్లైనా మరచునేమో నేను నిన్ను మరువలేను
నేనే నిను ఓదారుస్తాను – నేనే నిను ఓదారుస్తాను
ఒంటరియైనవాడు వేయిమంది అవుతారింక
బలమైన జనమౌదువు నువ్వు – బలమైన
నువు కుడి యెడమలకు వ్యాపింతువు.
శత్రు గవిని స్వాధీన పరచుకొందువు.
నువ్వు నీ నిందనంతా మరచిపోదువు.

నిమిష మాత్రం విసర్జిoచితిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తా నిన్ను
నిత్యమైన కృపను చూపి నా నిబంధన నెరవేరుస్తాను నేను
బాధించువారు నీకు దూరంగా ఉందురు గనుక
భీతి నీ దగ్గరకు రాదు – భీతి నీ దగ్గరకు రాదు
నీకు విరోధముగా గుంపు కూడువారు నీ
పక్షంగా చేస్తాను నేను – పక్షంగా
నీ నీతి నా వలన కలుగుచున్నది.
న్యాయవిమర్శలో నీకే జయమున్నది.
నీపై ఏ ఆయుధము వర్ధిల్లకున్నది.

Youtube Video

More Songs

Naa Devudu Goppavadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope 1

Bandhakamulalo Padiyundiyu Song Lyrics

1 thought on “Bandhakamulalo Padiyundiyu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Song 2024”

  1. Pingback: Shakthi Chetha Kane Kadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top