Telugu Christian Messages | Holy Bible || RAPTURE AND SECOND COMING || BIBLICAL PROPHECY || THE REVELATION
Table of Contents
“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.” యోహాను 1:1
వాక్యము అనగా
- వాగ్ధానము
- ఆజ్ఞలు/నియమములు
- ప్రవచనములు
ప్రవచనము :
ప్రవచనము అనగా భవిష్యత్తును గూర్చి చెప్పుట అని అర్ధం.పరిశుద్ధ గ్రంధంలొ ప్రవచనములు ఇశ్రాయేలును గూర్చి అలాగె యూదులును గూర్చి చెప్పబడినవి.
అబ్రహాము కుమారుడు అయిన ఇస్సాకు కుమారుడు అయిన యాకోబుకు 12 కుమారులు కలరు.వారు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను అనువారు.వీరు పన్నెండు గోత్రముల మూల పురుషులు.వీరు అందరు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు.యాకోబు కరువు కారణముగా ఐగుప్తు దేశమునకు వెల్లగా అక్కడ యోసేపు తరువాత వేరొక రాజు పరిపాళలనలొ వీరందరు దాసులుగా కొన్ని సం//లు ఉండగా లేవి గోత్రమువారైన మోషే ద్వారా దేవుడు వారిని విడిపించి పాలు,తేనెలు ప్రవహించు దేశమునకు వారిని తీసుకునిపొవును.
అయినను వారు పాపములు చేస్తున్నకారణమును బట్టి దేవుడు వారిని రాజులతో యుద్దములు జరిగించి అలాగె ఎందరో న్యాయాధిపతులను ఏర్పరుచుకుని వారిని గెలిపించడం జరిగెది.అయితె ఇశ్రాయేలీయులు వారికంటూ ఒక రాజు ఉండాలి అని కోరుకోగా సమూయేలు ద్వారా సౌలు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీయులను పరిపాలించును.అటు తరువాత దావీదు,సొలొమోను వంటి రాజులు పరిపాలించారు.అటు తరువాత ఉత్తరరాజ్యంగా ఇశ్రాయేలీయులు, దక్షిణరాజ్యంగా పన్నెండు గోత్రములలో యూదా గోత్రమువారు అలానే బెన్యామీను గోత్రమువారు కలిసి యెరూషలేమును రాజధానిగా చేసుకుని యూదులుగా పరిపాలించుకున్నారు. కొంతకాలమునకు దేవుడు ఇశ్రాయేలీయులును అష్షూరు రాజ్యమునకు అప్పగించును.యూదులైన వారిని బబులోను రాజైన నెబుకద్నేజరునకు అప్పగించును.అది మొదలుకుని ఇశ్రాయేలీయులకు,యూదులకు,ప్రపంచమునకు కలుగబొవునవి ఎందరొ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసినదే ప్రవచనం.

BIBLICAL PROPHECY
BIBLICAL PROPHECY “మొదటి భాగం”

ప్రవచన ఆరంభం:-
బబులోనులొ దాసులుగా ఉన్న తరువాత మాది-పాలస్తిన వారు యూదులును పరిపాలించగా దానియేలు ఇదివరకు దేవుడు యిర్మియ ప్రవక్త ద్వారా యెరూషలేమును గూర్చి చెప్పిన ప్రవచనమును గ్రంధముద్వారా గ్రహింపగా ఒక 70 సం//లు యెరూషలేము పాడుగా ఉండునను విషయమును తెలుసుకొనును.అందును బట్టి దానియేలు విజ్ఞాపన ప్రార్దన చేయగా గబ్రియేలు దూత వచ్చి దానియేలుతో ఇలా అనును- “తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను.” – దానియేలు 9: 24
ఒకటే విషయం గురించి దేవుడు యిర్మియకు అలానే గబ్రియెలు దానియేలుకు చెప్పెను గాని యిర్మియ 70 సం//లు అనెను, గబ్రియెలు 70 వారములు అనెను.
ఇందుకు సమాధానముగా (యెహెజ్కేలు:-4:6 –“సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను.”) అలానే (లేవీయకాండము:-25: 8 -“మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.) వచనముల నుండి మనము పరిశుద్ధ గ్రంధము ప్రకారం తెలుసుకొనవలిసింది ఏమనగా
1) 1 సంవత్సరం = 1 రోజు =>1 వారము = 7 రోజులు = 7 సంవత్సరములు
గనుక గబ్రియేలు చెప్పిన 70 వారములు అనగా 490 సంవత్సరములు అని అర్ధం.
2) 1 సంవత్సరం = 7 సంవత్సరములు
గనుక యిర్మియ చెప్పిన 70 సంవత్సరములు అనగా 490 సంవత్సరములు అని అర్ధం.
వీటిని బట్టి దేవుడు చెప్పేది “ఒక 490 సంవత్సరములు యెరూషలేము పాడుగా ఉండును” అని.
“యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.” – దానియేలు 9: 25
ఆ 490 సంవత్సరములలొ గబ్రియేలు చెప్పిన రీతిగా 7వారములు = 49 సంవత్సరములు యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరును. అలానే యెరూషలేమును కట్టినది మొదలుకుని యేసుక్రీస్తు వరకు 62వారములు = 434 సంవత్సరములు మొత్తముగా 483 సంవత్సరములు ముగిసెను.
“ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును.” – దానియేలు:- 9: 26
“After the sixty-two ‘sevens,’ the Anointed One will be put to death and will have nothing.” -DANIEL:-9:26
యేసుక్రీస్తు మరణించిన తరువాత ఇంకేమియు జరగదని గబ్రియేలు దానియేలుకు చెప్పును.అయితే క్రొత్త నిబంధన బట్టి యేసుక్రీస్తు మరణించిన తరువాత జరుగునవి తెలుసుకోగలము. అదేదనగా యేసుక్రీస్తు మరణించిన తరువాత 40 రోజులు గడిచిన పిమ్మట ఒలీవల కొండ పైన ఆరోహణమయ్యెను.ఆయన నిమిత్తము సర్వసృష్టికి సువార్తను చెప్పమని శిష్యులతో అనగా వారు ఒక రోజు గొప్ప ఉజ్జీవముతో సువార్త చెప్పగా పరిశుద్ధాత్ముడు దిగి ఎందరినో మార్చారు.దీనిని మనము అపోస్తుల కార్యములు:-2వ అధ్యాయములో గమనించవచ్చు.అది మొదలుకుని ఎన్నో పోరాటములను బట్టి శిష్యులు చెదిరిపోయి ఎన్నొ స్థలములలొ ఎన్నొ సంఘములను స్థాపించెను. వాటి వివరణ యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను గారు ప్రకటన గ్రంధము 2,3 అధ్యాయముల ద్వారా విశ్లేషణ చేసెను.దానిని బట్టి ప్రస్తుతం ఉన్న కాలము ఆకరి సంఘమైన లవొదికియ అని అర్ధం చేసుకొవచ్చు.గనుక ఈ సంఘకాలములను కృపాకాలములుగా అలానె నిశబ్దకాలములుగా పిలవబడును.ఇంకా గబ్రియేలు అలానే యిర్మియ చెప్పిన 490 సంవత్సరములలొ 7 సంవత్సరములు మిగిలెను.ప్రస్తుత కాలము లెక్కింపము ఎందుకనగా ఇది గబ్రియేలు చెప్పినటువంటి నిశబ్ద కాలము.
BIBLICAL PROPHECY
BIBLICAL PROPHECY ” రెండొవ భాగం “
మృతుల లోకము:- (SHEOL)
పరిశుద్ధ గ్రంధము ప్రకారము చనిపొయిన వారు ఎక్కడ ఉందురు అనెది తెలుసుకుందాము. చనిపొయిన తరువాత జీవితం బ్రతికి ఉన్నప్పుడు ఒక వ్యక్తి తాను చేయు క్రియలు పాపములా? అలానె పరిశుద్ధమైనవా? అను రెండు విషయములపైన ఆధారపడి ఉంటాయి.
పరిశుద్ధ గ్రంధములోని కొన్ని వచనములను బట్టి మృతులలోకమును గురించి దానిలోని భాగములను గ్రహించుకొనవచ్చు. అవేవనగా:-
–> పాతాళము:- (HEDIS)
- ఆదికాండము 44:29 => మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.
కీర్తనలు 89:48 => మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు? - సామెతలు 1:12 => పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయు దము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.
యెషయా 14:9,10,11 => నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది.వారందరు నిన్ను చూచినీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు.నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును. - యోబు 7:9 => మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు.
యెషయా 38:18 => పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. - సంఖ్యాకాండము 16:33 => వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
–> చెర:- (PRISON (OR) BOSOM OF ABRAHAM)
- కీర్తనలు 49:15=> దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును.
- సామెతలు 14:32=> అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- యెషయా 57:2=> వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.
- లూకా 16:22 => ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను.
–> అగాధం:- (ABYSS)
- లూకా 16:26 => అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను
–> కటిక చీకటి గల బిలము:- (TARTOROUS)
- యూదా 1:6 => మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
- పేతురు 2:4 => దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

*** ఇట్టి విధముగ మృతులైన వారి ఆత్మ వారు జీవించిన విధమును బట్టి మృతుల లోకమునకు పంపబడును. అయితే మరణం అనెది శరీరమునునకు గాని ఆత్మకు కాదు ఎందుకనగా దేవుడు మానవునికి జీవాత్మను ఇచ్చెను.మానవుని శరీరమునకు కూడా మరణం లేదు, కాని మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణమును బట్టి పాపము విస్తరించగా, పాపము వలన వచ్చు జీతము మరణము గనుక మానవుని శరీరముపై మరణమునకు అధికారం ఇయ్యబడినది. ఆ అధికారమును తొలగించుటకు దేవుడు యేసుక్రీస్తు మరణ,పునరుథ్థానము ద్వారా మనకు పాపమునుండి , మరణము నుండి విమోచన అనుగ్రహించెను. ***
పాపులు పాతాళమునకు పంపబడతారు. అయితే యేసుక్రీస్తు మరణించక ముందు ఉన్న దేవుని ప్రవక్తలు , పరిశుధ్ధులు మరణించిన తరువాత చెర లోనికి పంపబడిరి. యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన చెరలో ఉన్నవారికి సువార్త ప్రకటించి వారిని అక్కడనుంచి “పరదైసు” అను స్థలమునకు తీసుకునిపోవును. ఈ విషయమును క్రింది వచనముల ద్వారా గ్రహించవచ్చు.
•1పేతురు 3:20=> చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను.
•కీర్తనలు 68:18=> నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి.
•ఎఫెసీయులకు 4:8=> అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
•లూకా 4:18,19=> ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.
•లూకా 23:43=> అందుకాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
•ప్రకటన గ్రంథం 2:7=> జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
•2కోరింథీయులకు 12:3=> అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
*** పరదైసు భూమికి ధూరముగా ఉంటుంది. పరదైసును ఏదెను వనముగా అలానే పరలొకముగా ఎన్నొ తర్ర్జుమాలలో చెప్పబడతాయి ఇది దేవుని గూర్చిన మర్మము గనుక నిశ్చయముగా చెప్పలేము. ***
3 HEAVENS:- సాధారణముగా భూమికి పైగా మూడు ఆకాశములు కలవు.
–> మొదటి ఆకాశం -> The Atmospheric Heaven – The First Heaven
- ఆదికాండము 1:7,8=> దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.
- ఆదికాండము 1:20=> పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
- ఎఫెసీయులకు 6:12=> ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
–>మధ్య ఆకాశం -> The Celestial Heaven – The Second Heaven
- మత్తయి 24:29=> ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
- ద్వితియోపదేశకాండము 4:19=> సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.
–> మూడవ ఆకాశం -> Heaven As The Home Of God – The Third Heaven
- హెబ్రీయులకు 8:2=> మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు,(మూలభాషలో-పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని(మూలభాషలో-మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.
- అపో.కార్యములు 7:55,56 => అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.
- హెబ్రీయులకు 9:24 => అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
సారాంశం:-
ఆదికాండము 6వ అద్యాయములో దేవుడు నోవహును ఓడ తయారుచేయమన్నప్పుడు అతడు మూడు అంతస్తులను కలిపి ఓడగా చేసెను మరియు శరీరం, మనస్సు, ఆత్మ మూడు కలిసి ఉన్న వారు మానవుడు. అలానే ఆకాశము అనగా మూడు భాగములు ->
- మొదటి ఆకాశం :- మనము చూసే ఆకాశం, అక్కడ పక్షులు ఎగరగలవు, వాయుమండల అధిపతులు, దురాత్మ సమూహములు ఏలును.
- మధ్య ఆకాశం :- అక్కడ నక్షత్రములు, గ్రహములు,పాలపుంత ఉండును.
- మూడవ ఆకాశం:-అక్కడ దూతలు, సింహాసనాసీనుడైన గొప్ప దేవుడు ఉండును.

BIBLICAL PROPHECY ” మూడవ భాగం “
RAPTURE: (ఎత్తబడుట)
అలా దేవుని పరిచర్య నిమిత్తము సంఘములు ఏర్పరచబడి ఆయన సువార్త ప్రతీచోట ప్రకటింపబడగా దేవుని బూర ఊదబడి, హఠాత్తుగా ఉన్న పలంగా ఎవరి పనులు వారు చెసుకుంటూ ఉండగా పరిశుధ్ధులు,దేవుని బిడ్డలైనవారు మాయమైపోతారు.
ఎందుకనగా యేసుక్రీస్తు మధ్య ఆకాశమునకు వస్తారు. అక్కడ దేవుని నిమిత్తం మృతులైనవారి శరీరములు మహిమ శరీరములుగా లేపబడతాయి. లేచిన మహిమ శరీరములు పరదైసులో ఉన్న వారి ఆత్మలను కలిసిపోయి యేసుక్రీస్తును కలుసుకొనును మరియు భూమిపై మాయమైపొయినవారు ఎత్తబడి యేసుక్రీస్తును కలుసుకొనును. ఇది అంతా ఒక్క నిమిషములో రెప్పపాటున జరుగును. ఇక దాని తరువాత కృపా అనేది ఎక్కడ ఉండదు. గబ్రియెలు చెప్పిన నిశబ్దకాలము పూర్తి అవుతుంది.
- కోరింథీయులకు 15:51=> ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.
- మత్తయి 24:40,41,42,43,44=> ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
- థెస్సలొనికయులకు 4:14,15,16,17,18=> యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

AFTER RAPTURE IN “HEAVEN” :-
మధ్య ఆకాశంలోనికి సంఘము ఎత్తబడిన తరువాత అక్కడ క్రీస్తు న్యాయసింహాసన తీర్పు జరుగుతుంది. ఈ తీర్పును గ్రీకులో భీమా అంటారు. అంటె జీవితము చివరిలో పొందే ప్రతిఫలం అని అర్ధం.ఈ తీర్పులో శిక్ష అనేది ఎవరికి ఉండదు ఎందుకంటే అందరూ పరిశుద్దులు దేవుని కొరకు ఎదురుచూచినవారు. ఆ తీర్పులో క్రీస్తు పరిశుద్దులైన వారికి వారు చేసిన క్రియలను బట్టి లెక్కచొప్పున, కొలతలు చొప్పున మూడు విషయములు ఇచ్చును.
“2కోరింథీయులకు 5:10=> ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.”
- మెప్పు : 1పేతురు 1:7 => యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
- కిరీటములు : ప్రకటన గ్రంథం 3:11 => నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
- పదవులు : ప్రకటన గ్రంథం 22:12 => ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
•మనము రక్షణ తీసుకుని పాపములు చేస్తే మన రక్షణను కోల్పోము కాని మన కొరకు నియమించిన కిరీటములను కోల్పోతాము.
•భూమిలో మనము దేవునుకొరకు చేసిన దానిని బట్టి దేవుని వెయ్యి సంవత్సరముల పరిపాళనలో మనకు అధికారములు ఇయ్యబడును.
తీర్పు జరిగిన తరువాత వారు దేవునితో పరలోకములో సహవాసం చేస్తారు. ఇంక పరదైసు ఖాళీ చెయబడుతుంది. వరుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఉండగా, వధువుగా ఎత్తబడిన సంఘము ఉండి వివాహమహోత్సవం జరుగుతుంది. తరువాత పెండ్లి విందు జరుగుతుంది. ఇక వారు దేవుని నుంచి వేరుచేయబడరు అనే సూచన ఈ వివాహ కార్యం తెలియజేస్తుంది. ఇలా గొప్ప ఆర్భాటములతో పరలోకములో పెద్ద పండగే జరుగుతుంది.
ఈ విషయమును యోహానుగారు వ్రాసిన ప్రకటన గ్రంధము 19వ అధ్యాయములో గ్రహించవచ్చు.
AFTER RAPTURE ON “EARTH” :-
ఎత్తబడిన తరువాత గబ్రియేలు చెప్పిన నిశబ్దకాలము పూర్తి అవుతుంది. దేవుడు యిర్మియ ద్వారా అలానే గబ్రియేలు ద్వారా చెప్పిన 490 సంవత్సరములలో 483 సంవత్సరములు పూర్తి కాగా మిగిలిన 7 సంవత్సరములు సంఘం ఎత్తబడిన తరువాత మొదలవుతాయి. ఆ ఏడు సంవత్సరములే మహా శ్రమ దినములు. వాటి వివరణ యేసుక్రీస్తు శిష్యుడైన యోహానుకు కలిగిన దర్శనం ఆయన వ్రాసిన ప్రకటన గ్రంధము ద్వారా తెలుసుకొనవచ్చు.
- ప్రకటన గ్రంధము లోని 1,2,3 అధ్యాయముల ద్వారా కృపాకాలములో స్థాపించబడ్డ సంఘముల వివరణ తెలుసుకుంటాము. తరువాతి అధ్యాయములను బట్టి లోకంలో సంభవించు శ్రమలను,మార్పులను మనం గ్రహించవచ్చు. అవేవనగా:-
- ప్రకటన గ్రంధము 4వ అధ్యాయములో సర్వశక్తుడైన , సర్వాధికారి అయినా దేవాది దేవుని ప్రత్యక్షత మనము తెలుసుకుంటాము. 24 పెద్దలను, 4 జీవులును వాటి పూర్తి ఆకారవివరణను మనము తెలుసుకుంటాము.

- ప్రకటన గ్రంధము 5వ అధ్యాయములో ఒక గ్రంధమును చూడొచ్చు. ఆ గ్రంధములో ఏడు ముద్రలు ఉంటాయి. అవి తీసి ఆ గ్రంధమును విప్పగల యోగ్యుడు గొఱ్ఱెపిల్ల వలె వధింపబడిన యేసుక్రీస్తువారు మాత్రమే. ఎందుకంటే ఆయన మరణమును జయించిన గొప్పవారు. గనుక ఈ అధ్యాయములో మనము చూచే గొఱ్ఱెపిల్ల యేసుక్రీస్తు ప్రభువే.

“ప్రకటన గ్రంథం 5:6 = మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.”
ఆలా 7 ముద్రలు,7 బూరలు,7 పాత్రలు ఉండును. ముద్రలు తీయబడేటప్పుడు, బూరలు ఊదబడేటప్పుడు, పాత్రలు పోయునప్పుడు కలిగే సంఘటనలే ఎత్తబడిన తరువాత భూమిపై ఏర్పడే శ్రమ దినములు. మొదటిగా ముద్రలు విప్పబటడంతో శ్రమలు ప్రారంభమవుతాయి.

- ప్రకటన గ్రంధము 6వ అధ్యాయములో ఒక్కొక్క ముద్ర విప్పబడుతుంది. 7 ముద్రలలో 6 ముద్రలు విప్పబడతాయి.


BIBLICAL PROPHECY
“క్రీస్తు విరోధి“
ఎత్తబడడం జరిగిన పిమ్మట ప్రతి వ్యక్తి వారి వారి సంబంధులు మాయమయిపోయారు అని గ్రహించుకుంటారు.అలా గ్రహించుకుని ఎవరికి వారు రొమ్మును కొత్తుకుని ఏడుస్తారు. అప్పుడు ఒకడు వచ్చి వాల్లందరకి శాంతి మాటలు మాట్లాడతాడు. మొదటి ముద్ర విప్పినప్పుడు వాడు తన ముఖమును ప్రత్యక్షపరచుకుంటాడు. అతని వివరణ ఎక్కడనుంచి వస్తాడు, ఏమి చేస్తాడు అనునవి ప్రకటన గ్రంధము :- 13వ అధ్యాయములో గమనించవచ్చు.
- ఆ అధ్యాయము ప్రకారం 10 రాజ్యములు కలిపి ఒకరిని రాజుగా ఎన్నుకొనును. వాడికి సమస్తముపై అధికారము ఇయ్యబడును. అతను చావుని దాటి బ్రతుకుతాడు. ఆ కారణమును బట్టి ప్రజలందరూ వాడిని దేవునిగా చేస్తారు. అందరూ ఒప్పుకుంటారు గాని ఇశ్రాయేలీయులు , అలానే విడువబడిన క్రైస్తవులు నమ్మరు, ఒప్పుకోరు.
- ఆ సమయములో ఇశ్రాయేలులో ఒక అబద్ధ ప్రవక్త బయలుదేరతాడు. అబద్ధ ప్రవక్త , క్రీస్తు విరోధి ఎన్నొ అద్బుత కార్యములు,సూచక క్రియలు చేస్తారు. అయితే ఒక 7 సంవత్సరములు లోకమంతటా క్రీస్తు విరోధి ఏలుటకు ఆ అబద్ధ ప్రవక్త ఇశ్రాయేలీలులను ఒప్పిస్తాడు.
- అది మొదలుకొని శ్రమ కాలము మొదలవుతుంది.
- మొదటి 3 ½ సంవత్సరములు వాడి రాజ్యమును స్థాపించుకుంటాడు.
- చివరి 3 ½ సంవత్సరములు వాడి రాజ్యపాలన.
- సాతాను, అబద్ధ ప్రవక్త , క్రీస్తు విరోధి దుష్టత్రిత్వమై పాలిస్తారు.
- దానిని నమ్మిన వాడు నశించిపోవును.
క్రీస్తు విరోధి రాజ్యపరిపాలనకు ఐదు సూత్రములు ఉపయోగిస్తాడు. అవేవనగా:-
- ప్రపంచ శాంతి
- సర్వమత సమ్మేళనం
- యూరో కెరన్సీ
- ఇంటర్నెట్ వ్యవస్థ
- 666 ముద్ర (ప్రకటన:- 13:17)
“ఇశ్రాయేలీయులు క్రీస్తును నమ్మరు. వారికి ఇంకా వారి మెస్సయ్య రాబోతున్నాడు అనే అలోచనలోనే ఉన్నారు గనుక ఈ క్రీస్తు విరోధి తనని తాను మొదట మెస్సయ్యగా కనపరచుకుని ఇశ్రాయేలులో నివసించి తరువాత యెరూషలేములో అతి పరిశుద్ధ స్థలములో ఒక హేయమైన వస్తువుని పెట్టి తానే దేవుడిగా కనపరుచుకుంటాడు. మొదట మెస్సయ్యగా ఉండి తరువాత క్రూరమ్రుగముగా ప్రవర్తిస్తాడు. (దానియేలు:-9:27,మత్తయి:-24:15)”


- ప్రకటన గ్రంధము 7వ అధ్యాయములో ఈ శ్రమ దినములలో దేవుడు కొందరిని ఏర్పరచుకొని వారికి ఏమియు అవ్వకుండా, కలుగకుండా అయన ముద్ర వేయించి పరిశుద్దాత్మ కవచం వేయిస్తారు. వారు 12 గోత్రముల లోనివారు. అయితే వారిలో దాను గోత్రము ఉండవలసిన స్థానములో మనష్షే గోత్రమువారు ఉన్నారు. గనుక క్రీస్తు విరోధి దాను గోత్రపువాడు అని అపోహ.
అటు తరువాత ఎత్తబడిన సంఘమును గొప్ప సమూహమును తెల్లని వస్త్రములను ధరించుకుని చూస్తారు.
- ప్రకటన గ్రంధము 8వ అధ్యాయములో ఆకరి ముద్ర,ఏడవ ముద్ర విప్పబడును. అప్పుడు పరలోకములో గొప్ప నిశబ్దం ఉంటుంది ఆ నిశబ్దం బూరలు ఊదబడడానికి సూచనగా భావించి వెంటనే ఏడు దూతలు బూరలు పట్టుకుని సిద్దముగా ఉంటాయి.
“ముద్రలు విప్పబడినప్పుడు కలిగిన శ్రమలకు మించినవి దూతలు బూరలు ఊదునప్పుడు కలుగుతాయి.”


మొదటి నాలుగు బూరలు ఊదబడినప్పుడు మానవునికి ప్రకృతి సంభందించిన శ్రమలు సంభవిస్తాయి. అలా సంభవించు సమయములోనే క్రీస్తు విరోధి తాను లోకములో జరిగించు ప్రతీ కార్యమును జరిగించును. అలా 3 ½ సంవత్సరములు గతించును. 7 ముద్రలు విప్పబడడం, 4 బూరలు ఊదబడడం జరుగుతుంది.
ఇవన్ని 7సంవత్సరముల మధ్య వరకు జరుగును. అటు పిమ్మట క్రీస్తు విరోధి బలులను, నైవేద్యములను నిలిపివేసి వాడే రాజుగా,దేవుడుగా తనని తాను కనపరచుకొనుటకు యెరూషలేములో ఎదావిధిగా జరుగుచున్న బలులను ఆపివేసి అతిపరిశుద్ధ స్థలములో ఒక హేయమైన, అసహ్యమైన వస్తువును పెట్టి వాడి నిజస్వరూపమును కనపరుచుకొనును(దానియేలు:-9:27,మత్తయి:- 24: 15). యెహోవాను కాదనువాడు మెస్సయ్య ఎలా అవుతాడు అని గ్రహించుకుని అతన్ని దేవుడుగా ఒప్పుకోవాలి అనుకోరు. ఆ కారణమును బట్టి వారిని నాశనమును చేయాలని అనుకొనగా వారు తప్పించుకుని అరణ్యమునకు పారిపోతారు. వారికి మిగిలిన 3 ½ సంవత్సరములు యెహోవా కాపుదల లభించును. ఆ కాపుదలను బట్టి వారిని అరణ్యములో ఎందరో వచ్చి భోజనం,నీరు ఇస్తారు. (మత్తయి :- 25: 35-40)
***మిగిలిన 3 ½ సంవత్సరములు మిగిలిన బూరలు ఊదబడతాయి , పాత్రలు కుమ్మరింపబడతాయి.***
- ప్రకటన గ్రంధము 9వ అధ్యాయములో అయిదవ బూర ఊదబడినప్పుడు క్రీస్తు విరోధి 666 ముద్రను వేయించుకున్న వారిని అగాధము నుండి వింత ఆకారముగల పురుగులు వచ్చి కుట్టును. వేయించుకోనివారికి ఏ హానియు కలగకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును.దీనిని బట్టి మొదటి శ్రమ అంతమవుతుంది. ఆరవ బూర ఊదబడినప్పుడు వింత ఆకారములు గల గుర్రపు రౌతులు వచ్చి మానవునిలో మూడవ భాగమును చంపును.
BIBLICAL PROPHECY
“అయిదవ బూర”
ప్రకటన గ్రంథం 9:1 TO 12:
అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్యముఖములవంటివి, తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.(అనగా-నాశనము చేయువాడు) .మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును

“ ఆరవ బూర”
ప్రకటన గ్రంథం 9:-13 TO 21
ఆరవ దూత బూర ఊదినప్పుడు- దేవుని యెదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి యొక స్వరము-యూఫ్రటిసు అను మహానది యొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొనియున్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని.”మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి.”గుఱ్ఱపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు; వారి లెక్క ఇంత అని నేను వింటిని.”మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్న వారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమగంధకములు బయలువెలుచుండెను.””ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెలుచున్న అగ్ని ధూమగంధకముల చేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను.””ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వైనందున వాటిచేత అవి హాని చేయును.””ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహాములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.”మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయ మంత్రములను జార చోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.
- ప్రకటన గ్రంధము 10వ అధ్యాయములో ఒక దూత మనకి కనబడుతుంది. అప్పుడు ఆ దూతనుంచి వచ్చిన శబ్దములను యోహానుగారు వ్రాయబోవుతుండగా దేవుడు వాటిని రహస్యముగా ఉంచెను. అయితే ఆ దూత ఏడవ బూరను గూర్చి చెప్తూ దేవుని గూర్చిన మర్మము ఇంక పూర్తి అవ్వాల్సి ఉన్నది అని గ్రహించుకొనును.

=> అయితే ఆ దూత వద్ద ఒక గ్రంధము ఉండగా ఆ దూత ఆ గ్రంధమును తినాలని తిన్నాక చేదుగా ఉండును కాని నోటికి మధురముగా ఉండును అని అనెను. యోహాను గారు కూడా అదే జరిగిస్తారు. దూత చెప్పిన విధముగానే అతనికి తిన్నాక చేదుగాను, నోటికి మధురముగాను ఉండును.ఈ విషయమును యెహేజ్కేలు 3:1,2,3 వచనములలో మనము గమనించవచ్చు. దీనికి అర్ధము ఇంకా రాయబోవువాటిలో అపవాది శోధనలలో దేవుని ఆత్మీయ వాక్కు మనకు నూతన బలమును ఇచ్చును.
***మరలా అతను ప్రవచనము వ్రాయడం మొదలుపెట్టాలి అని ఆపిన గ్రంధమును వ్రాయుట మొదలుపెట్టును.***
- ప్రకటన గ్రంధము 11వ అధ్యాయములో ఇద్దరు సాక్షులను మనము గమనించవచ్చు. వారు దేవుని నిమిత్తమై ఎక్కడా సువార్త జరగనప్పటీకి వారిద్దరు దేవుని రాకడను ఆయనను గూర్చిన సేవను చేయును. వారు మోషే,ఏలియా వంటి సేవను చేస్తారు.
వారికి దేవుడు ఎన్నో గొప్ప సూచక క్రియలు చేయు అధికారమును ఇచ్చును.దానిని బట్టి క్రీస్తు విరోధి వారిని హతమార్చాలి అని అనుకుని వారిని చంపును. చంపి, వారిని బట్టియే ప్రపంచమునకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని నింధలు వేస్తాడు. ప్రజలందరు అది నమ్మి, వారి శవములను మధ్యలో పెట్టి పండుగ జరుపుకుంటారు. వారు చనిపోయి 3 ½ దినములు గడిచిన తరువాత టక్కున ఆ శవములు అందరి యెదుట లేచి, ఆకాశమునకు ఆరోహణమవును.వారు ఆరోహణమయిన వెంటనే పెద్ద భూకంపము కలుగును. అప్పుడు ఆ చోటులో పదియవ భాగము కూలిపోవును.ఎందరో చనిపోవును.మిగిలిన వారు దేవుని మహిమపరచును.ఇక్కడితో రెండవ శ్రమ ముగియును.
BIBLICAL PROPHECY
“ఏడవ బూర“
అదే అధ్యాయములో మనము ఏడవదూత ఏడవ బూర ఊదడం గమనించవచ్చు. ఏడవ బూర ఊదబడినప్పుడు ఇక దేవుని రాకడ అతిసమీపములో ఉన్నది అని అర్దం. దేవుడు ఇక లోకమును ఏలుటకు బయలుదేరదానికి సూచనగా ఈ బూర ఊదబడుతుంది. అనేక సంఘటనలు సంభవిస్తాయి.
1.శబ్దములు కలిగి క్రీస్తు లోకమంతా ఏలును అనును.
2.24 పెద్దలు ఆయన రాకడను ప్రకటించుదురు.
3.పరలోకములో దేవుని నిభందనను,ఆయన సన్నిధి తీర్మానమును కనబడును.
4.మెరుపులు,ద్వనులు పుట్టును.
5.భూకంపమును,గొప్ప వడగండ్లను పుట్టును.

- ప్రకటన గ్రంధము 12వ అధ్యాయములో అసలు ఇదంతా ఎందుకు,ఎలా మొదలైనదో తెలుస్తుంది.ఏడు వ్యక్తులును, ఏడు సంకేతములుగా మనము గమనించవచ్చు. వారు:-
1.సూర్యుని ధరించిన స్త్రీగా = ఇస్రాయేలు
2.మహా ఘట సర్పముగా = సాతాను
3.ఆ స్త్రీ కనిన శిశువు = యేసు క్రీస్తు ప్రభువు.
4.ప్రధాన దూతగా = మిఖాయేలు.

ఈ అధ్యాయములో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోవును. అదే విధముగా ఇస్రాయేలీయులు అరణ్యములకు పారిపోతారు. 1,260 దినములు అనగా చివరి 3 ½ సంవత్సరములు దేవుడు వారికి ఒక చోటును సిద్దపరచును.పరలోకమందు తనకి కలిగిన ఓటమిని బట్టి ఆ ఘట సర్పమైన అపవాది ఇశ్రాయేలును తరుముతూనే ఉంటాడు కాని యెహోవా వారిని కాపాడును.అయిననూ ఏదొక అవకాశము కొరకు అపవాది వెతుకుతూనే ఉంటాడు. అది మొదలుకొని మహా ఘోరమైన శ్రమలు పరలోకములో నుండీ భూమి పై పాత్రలు కుమ్మరించబడుటను బట్టి కలుగుతాయి. వాటిని తెలియపరచుటకు ఏడవ బూర ఊదబడును.
- ప్రకటన గ్రంధము 13వ అధ్యాయములో క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తను గురించి తెలుసుకుంటాము. వారు ఎలా వస్తారు? వచ్చి ఏమి చేస్తారు? వాడి ముద్రను గూర్చిన పూర్తి వివరములను మనము తెలుసుకొనవచ్చు.
- ప్రకటన గ్రంధము 14వ అధ్యాయములో 7వ అధ్యాయములో చెప్పబడిన ముద్రించబడిన వారిని చూస్తాము. వారు దేవున్ని ఎన్నో కీర్తనలతో స్తుతిస్తూ ఉంటారు. అలాగే దూతలను చూస్తాము. వారిలో :-
->మొదటి దూత :- సర్వ లోకమునకు సువార్త ప్రకటించును.
->రెండవ దూత :- వారిని పాపములోనికి నడీపించిన ముఖ్యమైన బబులోను నాశనమును ప్రకటించును.
->మూడవ దూత :- క్రీస్తు విరోధి, వాడి అనుచరుల యొక్క ముద్రను వేయించుకొను వారికి కలిగే దుస్థితిని ప్రకటించును.
అలానే యేసుక్రీస్తును పోలిన ఒక రూపము కోత కాలుము గనుక పంటను కోయుటకు కొడవలితో మేఘములపై వచ్చును.
అయితే మరొక మూడు దూతలు ఆయనకు సహకరించును. అనగా దేవుని ఉగ్రతను బట్టి ఎందరో చనిపోవుదురు.


- ప్రకటన గ్రంధము 15వ అధ్యాయములో మిగిలిన ఏడు పాత్రలను గూర్చిన పరిచయ వివరణను ఇచ్చును. ఏడు దూతలు ఏడు పాత్రలను కుమ్మరించుటకు సిద్దముగా ఉండడం గమనించవచ్చు. ఈ ఏడు పాత్రలకు గల సంకేతం భూమిపై సమస్తమునూ సమాప్తములగును అని. అవి దేవుని కోపముతో నిండి ఉన్న ఉగ్రత పాత్రలు. అవి ఇంకెంత భయంకరముగా ఉండునో అనెది ఊహకే అందదు.
- ప్రకటన గ్రంధము 16వ అధ్యాయములో పాత్రలు భూమిపై కుమ్మరింపబడినప్పుడు కలిగే ప్రతి తెగుళ్ళు వివరించబడ్డాయి.


BIBLICAL PROPHECY
“ఏడవ పాత్ర“
•ప్రకటన గ్రంధం:- 16:17,18,19,20,21
ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.
ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.
“ఇక భూమి అంతమవును అని సూచనగా ఏడవ పాత్ర కుమ్మరింపబడును.”

- ప్రకటన గ్రంధము 17,18వ అధ్యాయములలో బబులోను పట్టణము యొక్క తెగులను,దానికి కలుగు తీర్పును వివరించెను.బబులోను ఒక వేశ్యగా మనకు కనపరుచుకొనును. బబులోనులోని వారు నుంచి పాపము ఎంతగానో విస్తరించెను.దానిని ఆధారము చేసుకుని లోకములో ఉన్న ఘనులు,గొప్పవారు ఉల్లాసముగా ఉందురు. బబులోను కొన్ని పట్టణముల కలయిక. దానికి కీడుగా ఏడు కలుగును.
1) మానవ సంచారమంతా ఖాళీగా ఏమి లేకుండా అయిపోతుంది.
2)అగ్ని చేత కాల్చబడుతుంది.
3)ఒక్క గంటలో సమస్తం నాశనమయిపోతుంది.
4)జనులు దాని సరిహద్దులకు కూడా రావలని అనుకోరు.
5)ధనవంతులు అయినవాళ్ళకి ఏమియు మిగలదు.
6) బలవంతముగా ధ్వంసమయిపోవును.
7)ప్రతీ క్రియలను నిలిపివేయును.



BIBLICAL PROPHECY BIBLICAL PROPHECY BIBLICAL PROPHECY BIBLICAL PROPHECY BIBLICAL PROPHECY BIBLICAL PROPHECY BIBLICAL PROPHECY
BIBLICAL PROPHECY సారాంశము:-

BIBLICAL PROPHECY
” నాలుగవ భాగం ”

BIBLICAL PROPHECY
రెండవ రాకడ:-
- శ్రమ కాలములు ముగిసిన తరువాత యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కాపుదలను తీసివేయును. గనుక 3 దురాత్మలచేత ఏర్పరచబడిన సైన్యముతో క్రీస్తు విరోధి, అబద్ద ప్రవక్త ఇశ్రాయేలీయులను వెంబడించును.
- ఇశ్రాయేలీయులు యేసు క్రీస్తును సిలువ వేసిన ఒలీవల కొండ తట్టుగానే వెల్లును. వారు వారి పాపములను గ్రహించును యేసును అంగీకరించి వారి ఏక కుమారునికొరకు ప్రలాపించునట్లు వారు ప్రలాపించుదురు.
- వారు యేసును పిలిచిన కారణమును బట్టి దేవుడు వారి కొరకు అప్పటికే పరలోకములో పెండ్లి విందులో ఉన్న పరిశుద్దులతో ఒలీవల కొండపైకి రాజులా రాగా ఆ కొండ రెండుగా విడిపోయి, ఒక లోయగా ఏర్పడును. ఆ లోయలోనికి ఇశ్రాయేలీయులను ఏర్పరచి నిలబెట్టును.(జెకర్యా:- 14:4,5)
- వారిని వెంటాడుతూ ఉన్న క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, అపవాదితో దేవుడు హర్-మగిద్దొన్ అను యుద్ధము చేయును. క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను దేవుడు నరకములోనికి వేయును. అపవాదిని బంధించి అగాధములో ఉంచును.
(ప్రకటన గ్రంధం:-16:13,14,15,ప్రకటన గ్రంధము:-19:20,21, ప్రకటన గ్రంధము:20:2,3)
మహిమగల సింహాసన తీర్పు:-
ఆయన ఏర్పరచిన ఇశ్రాయేలును యెహోషాపాతు లోయలోనికి తీసుకుని వెళ్ళి , అక్కడ వారికి మహిమగల సింహాసన తీర్పు జరుగును.(యోవేలు:-3:1,2,3,12,13,14).
ఆ తీర్పులో ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు అన్యులు వారికి చేసిన సహాయమును బట్టి జనులు తీర్పు తీర్చబడుదురు. (మత్తయి:-25:31 TO 46)
వెయ్యెండ్ల పరిపాలన:-
ఇక ఇప్పుడు మిగిలిన ఇశ్రాయేలీయులను,అన్యులను ఉండినవారై ఎంతో గొప్ప రీతిగా దేవుడు తానే భూమికి రాజుగా, ఎత్తబడిన పరిశుద్ధులు వారికి అప్పగించబడిన పదవులను బట్టి అధికారులుగా భూమిని ఏలును. ఆ పరిపాలనలో ప్రేమ,ఆనందం,సమాధానము,దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసమును,సాత్వికమును,ఆశానిగ్రహము వంటి ఆత్మ ఫలములచే నిండిపోవును. నీతి న్యాయములను మంచిగా అనుసరించుచు ఎటువంటి స్వార్ధము లేక జనులు ఆనందముగా బ్రతుకుదురు. ఆ జీవితమును జీవించువారు నిశ్చయముగా ధన్యులు.(ప్రకటన గ్రంధము:-20:4, యెషయా:-65:20 TO 25)
గోగు-మాగోగుల యుద్ధము:-
వెయ్యెండ్ల పరిపాలన ముగుసిన పిమ్మట దేవుడు అగాధములో బంధింపబడిన అపవాది అయిన సాతానుని విడిపించును. వాడు మాయ మాటలు చెప్పి ఆదిలో హవ్వను మోసముచేసిన రీతిగా ఎందరినో మోసముచేయును. వారే గోగు-మాగోగు అను కొన్ని దేశాలు. ఇంత జరిగిననూ మారని వీరి బుద్దిని చూసిన దేవుడు పరలోకమునుండి అగ్ని జ్వాలలను పడవేసి భూమి అంతటిని కాల్చివేయును. ఇక భూమి నాశనమాయెను.(ప్రకటన గ్రంధము:-20:7,8,9,10)
దవళ సింహాసన తీర్పు:-
ఆదినుంచి ఉన్న ప్రతీ మానవుడు ఈ తీర్పులో భాగమవును. పాతాళము దానిలోని మృతులను అప్పగించును. జీవ గ్రంధము తెరువబడును. మన క్రియలు పరిశుద్ధములైనచో మన పేరు జీవ గ్రంధముయందు వ్రాయబడును. ఎవని పేరు అయితే జీవ గ్రంధమందు వ్రాయబడిలేదో వాడు నిత్య నరకమునకు పాత్రుడు. జీవ గ్రంధమందు ఎవరి పేరు వ్రాయబడినదో వారు నిత్యము దేవునితో ఆనందముగా బ్రతుకుదురు. వారికింక మరణము లేదు. (ప్రకటన గ్రంధము:-20:11,12,13,14,15)
నూతన ఆకాశం,నూతన భూమి:–
ఇక సమస్తమూ నూతనమయి,ఎంతో అందముగా క్రొత్త లోకములో ఆనందము విరజిల్లుతుంది.(ప్రకటన గ్రంధము:-21,22)

BIBLICAL PROPHECY
Youtube Videos for Reference
Telugu

English

More Info About BIBLICAL PROPHECY
For more information or any doubts about BIBLICAL PROPHECY reach out our Instagram page
Home Page:-
https://ambassadorofchrist.in/telugu-christian-songs-lyrics/
BIBLICAL PROPHECY | THE REVELATION | RAPTURE AND SECOND COMING | Life After Death

Really your work is so good 👍
All the best 💯
Maranatha.
Jesus is coming soon
thank You
glory to God alone
Blessed to get this💫
All Glory to God Alone🙌🤍
Keep Going🙌
praise the LORD🙌
Pingback: Bible Verses | Verse Of The Day | Word Of God | Gospel | Bible Vakyamulu | Scripture | bible-verses-psalm-ephisians-corinthians-isaiah-peter - Ambassador Of Christ
Pingback: Unchi Udaan Lyrics | ऊँची उड़ान | The Promise 2024 | Jesus Calls | Latest songs - Ambassador Of Christ
Praise the Lord brothers and sisters. Excellent explanation sir. If any available PDF please send me.
praise the LORD
ok brother