Pastor Praveen Pagadala Biography | Age, Wife, Family, Wikipedia | Real Christ Follower

Table of Contents
Pastor Praveen Pagadala Biography :-
పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరు?
ఆయన ఎవరు? ఆయన మరణానికి ముందు వరకు కూడా క్రిస్టియన్ మిషనరీస్‌కు, పాస్టర్స్‌కు, క్రిస్టియానిటీని విపరీతంగా ఫాలో అయ్యేవాళ్లకు తప్ప, ప్రవీణ్ గారు ఎవరు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఆయన మరణించిన తర్వాత ఇంతలా ఆయన పేరు ఎందుకు చర్చల్లో వస్తోంది అంటే, ఆయన చేసిన గొప్ప పనుల కారణంగా, ఆయన వ్యక్తిగత జీవితంలో పాటించిన విలువల కారణంగా.
ఆయన అసలు ఎక్కడి ప్రాంతానికి చెందిన వారు? వారి తల్లిదండ్రులు ఎవరు? వాళ్లు ఏం చేసేవారు? ఆయన భార్య పిల్లలు ఎవరూ? ఆయన ఏ ప్రొఫెషన్ చేసేవారు? ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదు. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన కోసం ఇంతమంది ఎందుకు రోదిస్తున్నారు? ఆయన చనిపోవడం తమ ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోయినట్టుగా భావిస్తూ ఎందుకు ఇంత మంది ఆయన విషయంలో న్యాయం జరగాలని, సమగ్ర విచారణ జరగాలని కోరుకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలను మనం తెలుసుకోవాల్సిందే.
ప్రవీణ్ గారు కడపకు చెందినవారు. ఆయన తల్లి ప్రొద్దుటూరు, అయితే తండ్రి ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది సమాచారం అందుబాటులో లేదు. ఆయన తల్లి క్రిస్టియన్ కాగా, తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారు. చిన్నప్పటి నుంచే ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకునే వారు. ఆయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. చదువుతో పాటు సామాజిక అంశాల మీద, క్రిస్టియానిటీ మీద ఆసక్తి ఎంతో ఉండేది.
చిన్న వయసులోనే ప్రవీణ్ గారి అన్నయ్యపై ఆయన స్నేహితుడు ఒకరు కత్తి విసిరారు. అది తెలుసుకున్న ప్రవీణ్ గారికి విపరీతమైన కోపం వచ్చి, తన అన్నయ్యకు ఆ కీడు తలపెట్టిన వ్యక్తిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకబాదారు. చివరకు అతడిని చంపేశారు అనుకొని తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు. అయితే ఆ వ్యక్తి మళ్లీ బతకడంతో, పోలీస్ కేస్ అవుతుందని భయపడ్డారు. ఆ సమయంలో ప్రవీణ్ గారి మావయ్య గారి అక్క అక్కడ సీఐగా ఉన్నారు. ఆమె ఎటువంటి కేసులు లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెటిల్మెంట్ చేసేశారు.
ఆ తరువాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది. “నేనేంటి ఇలా ఉన్నాను? ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాను? ఒక వ్యక్తిని ఎలా చంపేయాలని అనుకున్నాను?” ఇలాంటి ఆలోచనలు ఆయన మనసులో తిరిగాయి. అప్పుడే ఆయన గ్రహించారు – “నేను ఇక్కడ, ఈ సొంతూర్లో ఉండడం సరైంది కాదు. ఇక్కడ ఉంటే నా బిహేవియర్ మారిపోతుంది. నేను చాలా మొరటుగా తయారవుతున్నాను. అందరి పిల్లల్లానే, నేను కూడా సరైన లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తున్నాను.” ఈ విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు.
తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అల్లరి విపరీతంగా ఎక్కువ అవ్వడంతో పాటు, ఆయన వివిధ వ్యసనాలకు లోనవుతారేమో అనే ఆలోచనతో, ఆయన్ని హాస్టల్‌లో చేర్పించారు. ప్రవీణ్ గారు ఆరో తరగతిలో ఉండగానే హాస్టల్‌లో చేరారు. హాస్టల్‌లో చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనకు ఇంటికి వెళ్లిపోవాలని అనిపించేది. ఇంట్లో వాళ్ల ఆప్యాయత, ప్రేమను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాస్టల్‌లోనే ఉండి చదువుకున్నారు.
అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకొని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన విద్యాభ్యాసం ఆశ్చర్యకరంగా మధ్యప్రదేశ్ లో ఉన్న ఇండోర్ లో కొనసాగింది. ఇండోర్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఎంబిఏ పూర్తి చేశారు. ప్రవీణ్ వ్యాపార రంగం అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది.
అయితే వీటన్నింటికంటే ముందు ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్ కి ఆయనకు ఆహ్వానం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో ఆ మీటింగ్ కి హాజరైనప్పుడు అక్కడ ఆ వక్తలు మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయన్ని విపరీతంగా ఆలోచింపజేశాయి. అప్పటివరకు అప్పుడప్పుడు క్రిస్టియానిటీని ఆయన కూడా తోలనాడుతూ మాట్లాడేవారు. అంటే తెల్ల దుస్తులు ధరించడం, బొట్టు పెట్టుకోకపోవడం, వివిధ అనాచారాలు, మతాచారాలు, మూఢాచారాలు ఇవేమి ఆయనకు నచ్చేవి కాదు. కేవలం లాజిక్ మాత్రమే పని చేసేది, నమ్మకం పనిచేసేది కాదు. కాబట్టి అందరిలాగా హల్లెలూయా అనడం ఏంటి? అలాంటి విషయాలు ఆయన కూడా హేలనగా మాట్లాడేవారు.
హైదరాబాద్ లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్ లో “నీవు ఈ ప్రపంచానికి వెలుగు అవ్వబోతున్నావు” అని ఒక వక్త మాట్లాడారు. అది విన్న తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది. “నేను అందరి స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగి, ఎలా పడితే అలా ఉంటూ, ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలు చేసుకుంటూ ఎందుకు పనికిరానివాడిగా సమాజంలో, కుటుంబం దృష్టిలో, నా దృష్టిలో కూడా ఉంటే, నేను ప్రపంచానికి వెలుగు ఎలా ఇవ్వబోతాను?” అనే ఆలోచన ప్రవీణ్ గారి మనసులో విపరీతంగా అలజట రేపింది. ఆ ఆలోచనలోనే నిరంతరం ఆయన బతికేవారు.
ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకి యేసుప్రభువు కనపడి, “నువ్వు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్లి మతబోధన చేయి, నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి” అని ఆయన్ని ఆదేశించడం జరిగింది. అయితే ఇండోర్ ఎక్కడుందో కూడా ప్రవీణ్ గారికి అప్పటివరకు తెలియదు. సడన్ గా ఆ కలలో ఆ ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించి యేసు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఆయన నెక్స్ట్ డే గూగుల్ లో ఇండోర్ అని వెతికారు. ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకొని, ఇండోర్ కి ట్రైన్ లో కేవలం ఒక బ్యాగ్ లో రెండు జతల బట్టలు పట్టుకొని వెళ్ళిపోయారు.
వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియదు. హిందీ కూడా రాదు. దాంతో అలా ఏం చేయాలనే ఆలోచనలోనే రెండు మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయారు. ఉన్న డబ్బులతో ఏదో ఒకటి కొనితిని, రాత్రులు కూడా అక్కడే పడుకున్నారు. అలా ఉన్న సమయంలో ప్రవీణ్ గారు హిందీ నేర్చుకోవడంపై విపరీతమైన ఫోకస్ పెట్టారు. దాని కారణంగా కేవలం నెల రోజుల్లోనే అనర్గలంగా, నిరాటంకంగా, అత్యద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించే ఒక నైపుణ్యాన్ని ఆయన సంపాదించగలిగారు.
కేవలం నెల రోజుల్లో తెలుగు తప్ప వేరే ఏ భాష తెలియని ఒక వ్యక్తి హిందీని అంత బాగా నేర్చుకొని, అంత అనర్గలంగా ఉపన్యాసం చేయడం, యేసు మహిమల్ని అంత అత్యద్భుతంగా చెప్పడం చూసి, ఎంతో మంది ఆయన మాటలకి మంత్ర ముగ్దులయ్యారు. హిందీలో ఎంత బాగా ప్రసంగించడం చూసి, ఆయన హిందీ వ్యక్తి అనుకున్నారు, తప్ప తెలుగు వ్యక్తిని కూడా ఎవరు కనిపెట్టలేని స్థాయిలో ఆయన ప్రసంగం అత్యద్భుతంగా ఉండేది. టీవీల వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలను ప్రసారం చేసేవారు.
ఇదంతా చూసి మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోనే ఉన్న ఒక పాస్టర్ల కుటుంబం ఆయన్ని చేరదీసింది. ఆ పాస్టర్ల జంట, ఆ యువకుడిలో ఉన్న ప్రతిభను గమనించి, ఆయనలో ఉన్న అనర్గలమైన వాగ్దాటిని గమనించి, “ఈ యువకుడు ఎలాగైనా యేసు గురించి, ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పే అద్భుత వక్త అవుతాడు” అని గ్రహించారు.
యేసు ఆరాధనలోనే తమ జీవితాన్ని గడుపుతున్న ఆ జంట, ప్రవీణ్ గారిని తమ అల్లుని చేసుకోవాలని భావించారు. దానికి తగ్గట్టే ప్రవీణ్ గారు కూడా వారి కుమార్తెను ఇష్టపడడం, ఆ దంపతుల కుమార్తె కూడా ప్రవీణ్ గారిని ఇష్టపడడంతో, ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో, వారి ఇష్టాన్ని గ్రహించి, గుర్తించి, గౌరవించి, ఆ పాస్టర్ల జంట వారిద్దరికీ వివాహాన్ని జరిపించారు.
2006 లో ఆయనకు వివాహం అయ్యింది. వివాహం తర్వాత ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకి విపరీతమైన ఆరోగ్య సమస్యల కారణంగా, ఆమె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది. దాంతో ప్రవీణ్ గారు విపరీతమైన వేదనకు గురయ్యారు. “దేవుడి సేవలో ఇంతగా తలుస్తున్న నాకు ఈ కష్టాలు ఏంటి? నా కుమార్తెకి ఈ ఆరోగ్య సమస్యలు ఏంటి?” అని ఆ దేవుడితోనే ఆయన తనలో తాను మాట్లాడుతూ గొడవపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
అలాగే ఆయనకు ఉద్యోగం రావడానికి, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పని చేసిన అనుభవం ఉంది.
మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవారు ఆనాటి నుంచి తనకు వచ్చిన దానిలో కొంత మేర సమాజసేవకు ఉపయోగించేవారు. అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు, వివాహానికి తర్వాత వేర్వేరుగా చూడవచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు తన భార్యను విపరీతంగా ఆరాధిస్తారు.
తను చేసే సేవా కార్యక్రమాల్లో, తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో, తన మత ప్రచారాల్లో, మత ప్రబోధకుడిగా ఎన్నో ప్రాంతాలకు పర్యటించి యేసు మహిమలను బోధించడంలో – వీటన్నింటిలో కూడా ఆమె సహాయ సహకారాలు ఎంతో ఉంటాయి. పైకి కనిపించేది ఆయనే అయినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్‌లో చేయాల్సిన వర్క్ అంతా తన భార్య చేస్తుందని ఆయనే పలు సందర్భాల్లో చెప్పిన విషయం గమనార్హం.
ప్రవీణ్ గారి గురించి ఎందుకు అంత మంది మాట్లాడుకుంటున్నారు అంటే, దానికి కారణం ఆయన తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనుకోవడమే కాకుండా, వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఉపాధి కల్పించడం అక్కడితో ఆగకుండా, మరో రెండు మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పించారు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీల ద్వారా వచ్చిన లాభాలను కేవలం తన స్వార్థానికి మాత్రమే కాకుండా సమాజ సేవ కోసం ఉపయోగించారు.
పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం, ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం, రోగగ్రస్తుల కోసం – ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు అందించేందుకు కృషి చేశారు. అనాథల కోసం అనాథాశ్రమాలు, వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు కట్టించి వారి సేవలో నిమగ్నమయ్యారు.
ప్రవీణ్ గారి జీవితంలో మరో ముఖ్యమైన విషయం – ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఒకరు 17 సంవత్సరాలు, మరొకరు 4 సంవత్సరాలు. అయితే, కేవలం వారిద్దరినే తన సంతానంగా కాకుండా, ఎంతో మంది నిరుపేద యువతను, తల్లిదండ్రులు లేని అనాథలను తన కుటుంబంతో సమానంగా చూసుకున్నారు. వారికి చదువు ఇప్పించి, ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి, పెళ్లిళ్లు చేసి, వారి పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం ఆయనది.
ప్రతి మగవాడి విజయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న మాటను నిజం చేస్తూ, ప్రవీణ్ గారి ప్రతి విజయంలో కూడా ఆయన భార్య భాగమై ఉండేది. ఆయన అనేక సందర్భాల్లో తన భార్యే తన వెన్నుదన్నుగా నిలిచారని చెప్పుకున్నారు.
ఆయన మరణానికి సంబంధించిన వివరాలు :
ఒకానొక సందర్భంలో, హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి బైక్‌పై బయలుదేరి, రాజమండ్రికి వెళ్లాల్సి ఉందని తన భార్యకు చెప్పారు. అయితే, బయలుదేరేటప్పుడు తనతో ఎవరైనా సహాయకుడు లేదా సహాయ సిబ్బంది లేకపోవడం ఒక దురదృష్టకరమైన విషయం. బైక్‌పై ఇంకెవరైనా ఉంటే, ప్రమాదం జరిగినా లేదా ఏదైనా అనర్థం జరిగినా, ఎవరికైనా సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ, ఆ ఒక్కరే అర్ధరాత్రి ప్రాంతంలో ఎందుకు బయలుదేరారు?
ప్రవీణ్ గారు గతంలో తనకు ప్రాణహాని ఉందని, తనను బెదిరిస్తున్నారని, తనను హతమార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మీడియా ద్వారా తెలియజేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో, రాత్రివేళ ఒంటరిగా ఎందుకు వెళ్లారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రవీణ్ గారు ఇతర మత ప్రబోధకులతో పోలిస్తే చాలా విభిన్నంగా వ్యవహరించారు. చాలా మంది మత గురువులు తమ జీవనోపాధి కోసం మాత్రమే బతకగా, ఆయనే మాత్రం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి, కోట్లాది రూపాయల ఆస్తులను సమాజ సేవ కోసం వినియోగించారు.
ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ప్రవీణ్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన సేవా కార్యక్రమాలు, జీవిత విధానం అనుసరించదగినది.
చెప్పారు అదేంటంటే దేవుడు పని చేసేవారినే ఎక్కువ ఇష్టపడతాడు. కాబట్టి మనం మన పని దైవ కార్యం చేస్తూనే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. అందుకే ఆయన మిగతా అందరి పాస్టర్ల కన్నా విభిన్నంగా ఇన్ని వేల మందిని, లక్షల మందిని ప్రభావితం చేయగలిగారని మనం గమనించచ్చు.
అలాగే ఆయన బోధనలు, స్పీచ్లు విన్న ఏ ఒక్కరైనా కూడా ఆయన మాట్లాడే దానిలో ఒక మంచి లాజిక్‌ను గ్రహించగలుగుతారు. అంటే మూఢత్వంతో, మూర్ఖత్వంతో, వితండవాదంతో ఆయన చేసే సంభాషణలు ఏవి కూడా ఉండవు. ఆయన చేసే సంభాషణ ఏదైనా జ్ఞానాన్ని పెంపొందించేదిగా, ఒక సబ్జెక్టు వైస్ మాత్రమే ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.
ఏది ఏమైనా, మంచి విలువలు పాటిస్తూ ఉన్నత విద్యావంతుడై, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, పేదలకు, దీనులకు తనకున్న జ్ఞానాన్ని పంచి, తన సంపాదనను కూడా ఖర్చు పెట్టి తన సేవతో దేవుడిగా మారారు. అందుకే ఆయన గురించి ఇంతమంది గుండెలు ఆరాటపడుతున్నాయని మనం చెప్పొచ్చు.
అలాగే ఈ కేసు విషయంలో సరైన విధంగా దర్యాప్తు జరిగి అనుమానాలన్నీ తొలగిపోయి సరైన విధంగా ఫలితం రావాలని కోరుకుందాం.
More Posts
Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography Pastor Praveen Pagadala Biography
