దైవ మాట! మా నోట! | Daiva Maata Maa Nota Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Daiva Maata Maa Nota Song Lyrics
దైవ మాట! మా నోట! పలుకుతాం, అది జీవపు ఊట!
దైవ మాట! మా నోట! చెడును కాల్చేడి నిప్పుల ఊట!
రాజాజ్ఞ ఈ మాట – అధికారం గల మాట – ఆయుధము నీ నోట!
పెల్లగించేయ్ – ప్రభువు నాటని మొక్కను
విరుగగొట్టేయ్ – సాతాను కాడిని
నశింపజేసేయ్ – అపవాది క్రియలను
పడద్రోసేయ్ – ఆ దుష్టుని ప్రతి దుర్గమును
కట్టరా యిక దేవుని రాజ్యము
నాటరా ప్రతి హృదయంలో వాక్యము
(నాటరా ఈ వాక్యంతో సంఘము)
ప్రపంచములు ఈ మాట వలనే నిర్మాణములైనవి గదా!
మహత్తుగల తన మాట చేత నిర్వహించుచున్నాడుగా!
సృష్టిని పరిపాలించే దైవం ఈ మాట!
సృష్టిని నడిపిస్తున్న శబ్దం ఈ మాట!
ఈ మాట నువు పలికి ఏలేయ్ ప్రతిచోట!
ప్రవక్తలంతా ఈ మాట పలికి రాజ్యాల్నే కదిలించెగా!
తన సేవకుల మాటల్ని ప్రభువు తప్పక రూఢిపరచుగా!
ఆత్మ చెప్పే మాట పలుకు నీ నోట!
ఉరుమై గర్జించాలి సత్యం ప్రతిచోట!
ఈ మాట నిష్ఫలము కాదు ఏ పూట!
ప్రభువైన యేసు, తన మాట వలన దయ్యాలను వదిలించెగా!
తన వాక్కు పంపి, ఏ వ్యాధినైనా క్షణమందు బాగుచేసెగా!
గాలి తుఫాన్నైనా ఆపును ఈ మాట!
ఎండిన ఎముకలనైనా లేపును ఈ మాట!
ఈ మాటతో కూల్చేయ్ రా ఆ దుష్టుని కోట!
ప్రతి రోజు నువ్వు శోధనలన్నిటిని గెలవొచ్చు ఈ వాక్కుతో!
ఆత్మయుద్ధంలో దుష్టుని ఎదిరించి తరుమొచ్చు ఈ కత్తితో!
దుష్టుని నేలకు కూల్చే ఖడ్గం ఈ మాట!
చీకటి శక్తులపైన విజయం ఈ మాట!
ఈ మాట అపవాది గుండెల్లో తూట!
ప్రకటించేయ్ వాక్యం, బందీలందరికి, స్వాతంత్ర్యమునిచ్చే సత్యం!
హృదయపు లోతులను, సరిచేసే శస్త్రం, ఇది రెండంచుల గల ఖడ్గం!
బండను బద్దలు చేసే సుత్తె ఈ మాట!
చెత్తను దగ్ధం చేసే అగ్ని ఈ మాట!
ఈ మాట దీపంలా చూపించును బాట!
ప్రవచనమగు వాక్యం నువు పలుకుతూ ఉంటే అద్భుతాల్ని చూస్తావుగా!
వాక్యం నెరవేర్చే బలశూరులైన దూతల్ని పొందొచ్చుగా!
వాక్యం నీకు వస్తే దైవం నువ్వంట!
వాక్యం నీలో ఉంటే (నువ్వు తింటే) బలవంతుడవంట!
ఈ మాట మండించును హృదయాల్లో మంట!
Pingback: Krupa Leka Nenu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ