Dikkulanni Nanu Vekkirinchina | Naa Sonthama Naa Bhandama | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Dikkulanni Nanu Vekkirinchina Song Lyrics
దిక్కులన్ని నను వెక్కిరించిన నా దిక్కె నీవై ఉంటివే
బంధాలన్నీ బహు దూరమైనా నా బంధం నీవై ఉంటివే ..
నా సొంతమా.. నా బంధమా ఆరాధన నీకే
అనురాగమా నా ఏసయ్యా ఆరాధనా నీకే
తెలియని కలతలే నన్ను తరుముచుండగా
ఎరుగని పోరాటమే- నను వెంటాడగా
నీ రెక్కల నీడలో నను దాచినావయా
ఏ కీడు రాకుండా నను కాచినవయ్య
ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే
సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే
ఆరడి మాటలే నను దోషిగా చేయగా
ఆగని నిందలే నను క్రుంగజేయగా
హేతువే లేని గాయాలే నను హేళన చేయగా
ఎదుటే నిలిచినా నీవే నా దరికే చేరగ
గడిచిన కాలము – నడచిన మార్గము నీవే చూచినది
తగిలిన గాయము -పగిలిన హృదయం నీవే మార్చినది
ఎడబాటులే అలవాటుగా మారిపోయెనే
తడబాటులే నను విడువక తల్లడిల్ల చేయగా
నున్న నీతో నంటూ – నా వెంటే నడిచిటివి
నా రక్షణ శృంగం నీవే -నన్ను రక్షించావే
అర్హతలేని అల్పునికి అధికారం మిచితివే
అంతము వరకు ఆరాధించే భాగ్యము నిచితివే
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Join our WhatsApp Channel to Participate in telugu bible quiz and win spiritual Gifts