ఎంత గొప్ప బొబ్బ పుట్టెను | Entha Goppa Bobba Puttenu Song Lyrics | Latest Telugu Good Friday Songs 90s

Table of Contents
Entha Goppa Bobba Puttenu Song Lyrics
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకుఁ కల్వరి మెట్టను సంతసముతో
సిల్వఁ గొట్టఁగ నూర్యుఁ డంధకారమాయెను
||ఎంత||
గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు
పలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెను
నలుదెసలకును జనులు పోయిరి కలువరి పై కలిసికొనిరి
||ఎంత||
పావనుండగు ప్రభువు మనకొరకై యా సిలువమీఁద చావునొందెడు
సమయమందున దేవుఁడా నా దేవుఁడా నన్నేల చెయివిడిచితివి యనియా
రావముగ మొఱబెట్టెను యె హోవయను దన తండ్రితోను
||ఎంత||
అందు దిమిరము క్రమ్ము గడియయ్యొ నా నీతి సూర్యుని నంత చుట్టెను
బంధకంబులు నిందవాయువు లెన్నో వీచెను కందు యేసుని యావరించెను
పందెముగ నొక కాటువేసెను పాత సర్పము ప్రభువు యేసును
||ఎంత||
శాంతమాయె నటంచుఁ బలుకుచును ఆ రక్షకుఁడు తన స్వంత విలువగు
బ్రాణమును వీడెన్ ఇంతలో నొక భటుఁడు తనదగు నీటెతోఁ ప్రభు
ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి పాపులను ర క్షించు రక్తపు ధారఁ గారెను
||ఎంత||
Youtube Video

More Songs
