హృదయాలనేలే రారాజు | Hrudayalanele Raraju Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Hrudayalanele Raraju Song Lyrics
హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును
||హృదయాల||
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా
||హృదయాల||
నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా
హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును
Youtube Video
More Songs
Yedavaka Ooruko Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian songs 2024