జయసంకేతమా | Jayasankethamaaa Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.JOHN WESLEY Anna

Table of Contents
Jayasankethamaaa Song Lyrics
జయసంకేతమా దయా క్షేత్రమా..
నన్ను పాలించు నా యేసయ్యా…(2)
అపురూపము నీ ప్రతి తలపూ
అలరించిన ఆత్మీయ గెలుపూ..(2)
నడిపించే నీ ప్రేమ పిలుపు
(జయ సంకేతమా)
నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు సర్వము సమకూర్చే నే (2)
నన్నేల ప్రేమించ మనసాయను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైన నీ రుణము తీర్చేదెలా
నువ్వు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించెద
నా యజమానుడా సేవించెద నా యజమానుడా
(జయ సంకేతమా)
నిలిచెను నా మదిలో నీ వాక్యమే
నాలోన రూపించె నీ రూపమే (2)
దీపము నాలో వెలిగించగా
నా ఆత్మ దీపం వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలను
భజించి నిన్నే కీర్తింతును
జీవిత గమనం స్థాపించితివి సీయోను
చేర నడిపించుమా సీయోను చేర నడిపించుమా
(జయ సంకేతమా)
నీ కృప నా యెడల విస్తారమే..
ఏనాడు తలవని భాగ్యమిదీ. (2)
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధి నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయే నాకెన్నడు
ఆత్మ బలముతో నన్ను నడిపించే
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా..
(జయ సంకేతమా)
Youtube Video

More Songs
