కనుపాప వలే నను కాయుటకే | Kanupaapavale Nanu Song Lyrics | New Year 2025 Promise Song | Pst T Jafanya Sastry
Table of Contents
Kanupaapavale Nanu Song Lyrics
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే
॥కనుపాప॥
జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా
॥కనుపాప॥
దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా