కరుణ కటాక్షము గల యేసయ్యా | Karuna Kataksham Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.FREDDY PAUL

Table of Contents
Karuna Kataksham Song Lyrics
కరుణ కటాక్షము గల యేసయ్యా
నను విస్తరింపజేయు మహనీయ (2)
దివ్య సుందరమ – దయకు నిలయమ
దివిలో కాంతితేజమా
పరిమళ నామమ – ప్రేమకు నిలయమ
పరిశుద్ధ స్తుతి గానమా (2) (కరుణ)
ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు
ఆదరించి ప్రేమించి కటాక్షించినావు (2)
నీ రెక్కల నీడే సురక్షితం
నీ పాద సన్నిధె క్షేమము (2)
కృపవెంబడి కృపను – నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు (2)
(కరుణ)
నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు
ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు(2)
నీ ఇష్టునిగా నివసించెదను
నీ ఉద్దేశము నే మరువను (2)
కృపవెంబడి కృపను – నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు (2)
(కరుణ)
ఏ యోగ్యత లేని నాకు తోడుగ నిలిచావు
నింద అవమానములో ఘనతనిచ్చినావు (2)
నీ నడిపింపుకు లోబడితిని
నీ స్వాస్థ్యముకై వేచియుంటిని (2)
కృపవెంబడి కృపను – నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు (2)
(కరుణ)
Youtube Video

More Songs
Mahaganudaa Yehova Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.John wesley
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Pingback: Abrahamu Nammina Devuda Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.RAMESH Anna - Ambassador Of Christ